షాకింగ్‌,ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌.. మరోసారి వేల మంది ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపు

14 Nov, 2022 15:05 IST|Sakshi

మల్టీమిలియనీర్‌, ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్‌ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్‌లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేశారు. అయితే ఈ వారం ముగిసేలోపే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ప్లాట్‌ ఫార్మర్‌ కేసీ న్యూటన్‌ రిపోర్ట్‌ ప్రకారం..నవంబర్‌ 11న (శనివారం) ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో పనిచేసే సుమారు 5,500 మందిలో 4,400 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఫైర్‌ చేసినట్లు తెలిపారు. 

ఒక వేళ సంస్థ తమని తొలగించిందని ఉద్యోగులు తెలుసుకోవాలంటే ఎలా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కేసీ న్యూటన్‌..ఫైర్‌ చేసిన సిబ్బందికి సంస్థతో ఉన్న అన్నీ రకాల కమ్యూనికేషన్‌లు నిలిచిపోతాయని అన్నారు. 

ఇక తాజాగా తొలగించిన ఉద్యోగులు యూఎస్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన కంటెంట్‌ మోడరేషన్‌, రియల్‌ ఎస్టేట్‌, మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులని పేర్కొన్నారు. 

మేనేజర్లకే తెలియదు
ఇక ట్విటర్‌, లేదంటే మస్క్‌ తొలగించిన ఉద్యోగుల్ని మేనేజర్లు గుర్తించడం కష్టమేనని. ఒక్కసారి ఉద్యోగుల్ని తొలగిస్తే వారికి, మేనేజర్ల మధ్య ఉన్న కమ్యూనికేషన్‌ వ్యవస్థ నిలిచిపోతుందని కేసీ న్యూటన్‌ ట్విటర్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపుపై ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. 

సమాచారం అందింది
మస్క్‌ ఫైర్‌ చేసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టెర్మినేషన్‌ మెయిల్‌ వచ్చినట్లు సమాచారం. ప్రాధాన్యత, ఖర్చు తగ్గింపు కారణాలతో తొలగించినట్లు, వేటు వేసిన ఉద్యోగుల లాస్ట్‌ వర్కింగ్‌ డే ఇవాళేనని (నవంబర్‌ 14)  తెలుస్తోంది. 

చదవండి👉 8 డాలర్ల కోసం ఎలాన్‌ మస్క్‌ కక్కుర్తి.. దిగ్గజ సంస్థకు 1.20 లక్షల కోట్లు నష్టం!

Poll
Loading...
మరిన్ని వార్తలు