Elon Musk Video: వారెవ్వా! అదిరిపోయిన ఎలన్ మస్క్ మార్స్ విజన్ వీడియో..!

16 Feb, 2022 16:55 IST|Sakshi

స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్‌ మస్క్‌ గతంలో రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్‌ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్‌ఎక్స్‌ ద్వారానే సాధ్యం అవుతుందని గతంలో చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా మస్క్ వేగంగా చర్యలు చేపట్టారు. స్పేస్‌ఎక్స్ తన ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ మొదటి కక్ష్య ప్రయోగం పనులు వేగంగా జరుగుతున్నాయి.

అంతరిక్ష నౌకలో అంగారక గ్రహాన్ని ఎలా చేరుకొనున్నారో అనే దాని గురించి బిలియనీర్ ఎలన్ మస్క్ తన ట్విటర్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఎలన్ మస్క్ ట్వీట్‌ చేస్తూ.. "ఇది మన జీవితకాలంలో నిజం కాబోతుంది" అంటూ స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ టూర్ కి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ పోస్టును 58 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇప్పటివరకు నిర్మించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇది. స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ఎత్తు 390 అడుగుల(119 మీటర్ల) వరకు ఉంటుంది.

2050 నాటికి 10 లక్షల మందిని అంగారక గ్రహానికి పంపాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2025లో తొలిసారి మనిషిని అక్కడికి తీసుకొని వెళ్లాలని చూస్తున్నారు. మార్స్‌ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్‌ మస్క్‌ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్‌ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్‌ఎక్స్‌ ప్రయోగానికి బీజం వేయించింది. 

(చదవండి: బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!)

మరిన్ని వార్తలు