ట్విటర్‌ యూజర్లకు షాక్‌: భారీ వడ్డన దిశగా మస్క్‌ ప్లాన్లు

31 Oct, 2022 12:22 IST|Sakshi

న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్‌  ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ కొనుగోలు చేసినప్పటినుంచి ప్రతీ రోజు ఏదో ఒక సెన్సేషన్తో  సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నారు. మస్క్‌ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తాజాగా తెలుస్తోంది. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని యోచిస్తున్నన్నారన్న వార్త ట్రెండ్ అవుతోంది. ఇప్పటిదాకా బ్లూటిక్‌ అంటే గౌరవంగా, అఫీషియల్‌ ఖాతాగా భావించేవారు. ఇపుడిక వారికి నెలకు సుమారు రూ. 1640 భారంగా మారనుంది.  ఈ వార్తలతో ‘ట్విటర్‌ బ్లూ’  హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.  (Bluetick ట్విటర్‌ బ్లూటిక్‌ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు)

44 బిలియన్‌ డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌ ట్విటర్‌ యూజర్లకు గట్టి షాక్‌ ఇవ్వనున్నారట. ముఖ్యంగా ట్విటర్‌కు బాగా ఎడిక్ట్ అయిన బ్లూ టిక్‌ వెరిఫైడ్‌ అకౌంట్‌ యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను వసూలు చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారట. ది వెర్జ్ నివేదిక ప్రకారం బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్ కోసం వినియోగ దారుల నుంచి నెలకు  20 డాలర్లు (19.99) వసూలు చేయనున్నారట. దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, బ్లూటిక్‌ ఉన్న యూజర్లు ఈ కొత్త నిబంధన ప్రకారం చెల్లింపు చేయాల్సిందే. ఇందుకుగాను  యూజర్లకు 90 రోజులు గడువు ఇస్తారు. గడుపులోపు చెల్లించకపోతే సదరు యూజర్లు ట్విటర్‌ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను కోల్పోతారు.  అంతేకాదు ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి ఉద్యోగులకు నవంబర్ 7 వరకు గడువిచ్చారు. లేదంటే వారికి ఉద్వాసన తప్పదని కూడా హెచ్చరించినట్టు సమాచారం.

అయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సబ్‌స్క్రిప్షన్  పద్దతి అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో నెలకు 5 డాలర్లు వసూలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రీమియం, హెవ్వీ ట్వీటర్లను కోల్పోతోందన్న నివేదికల మధ్య ఈ సర్వీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎలా అందుబాటులోకి తెచ్చేలా మొత్తం పేమెంట్ స్ట్రక్చర్‌ప్లాన్‌ను ఎలా మారుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు