రాజకీయ పార్టీలపై ఎలన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

3 Jun, 2022 19:32 IST|Sakshi

స్పేస్‌ఎక్స్‌ ఫౌండర్‌, టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అమెరికా రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంత కాలంగా ఫ్రీ స్పీచ్‌ మీద వరుసగా ఎలాన్‌ మస్క్‌ లెక​‍్చర్లు ఇస్తున్నాడు. అదే సమయంలో ట్యాక్స్‌ సిస్టమ్‌ మీద కూడా వరుసగా విమర్శలు గుప్పిస్తున్నాడు. దీంతో సంప్రదాయ రిపబ్లిక్‌, ఉదారవాద డెమెక్రాట్‌లలో మస్క్‌ ఎవరి పక్షనా నిలబడుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అతను  ఏ విధమైన పొలిటికల్‌ స్టాండ్‌ తీసుకుంటాడనే ఆసక్తి అమెరికన్లతో పాటు బయటి దేశాల్లోనూ పెరిగింది. 

హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత రిక్‌కరుసో లాస్‌ఏంజెలెస్‌ మేయర్‌ పదవికి పోటీ పడుతున్నారు. రిక్‌కురుసో స్వహతాగా రిపబ్లికన్‌ పార్టీ సానుభూతిపరుడిగా గుర్తింపు పొందాడు. తీరా ఎన్నికల సమయానికి డెమెక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో నిలవాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు రిక్‌ కరుసో మంచి వాడంటూ ఎలాన్‌ మస్క్‌ మద్దతు పలికాడు. దీంతో ఎలాన్‌ మస్క్‌ పోలిటక్‌ స్టాండ్‌ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

తన పొలిటికల్‌ స్టాండ్‌పై నెలకొన్న గందరగోళానికి తెర దించే ప్రయత్నం చేశాడు ఎలాన్‌ మస్క్‌. ఈ మేరకు శుక్రవారం ఓ ట్వీట్‌ను వదిలాడు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకు మద్దతుగా నిలవడం అనేది నేను చాలా అరుదుగా చేసే పని అన్నారు మస్క్‌.  చాలా మంది అమెరికన్ల తరహాలోనే రాజకీయంగా తాను మధ్యే వాదినంటూ చెప్పుకొచ్చాడు. రిపబ్లిక్‌, డెమోక్రాటిక్‌ పార్టీల్లో ఏ ఒక్కదానికి తాను పూర్తి స్థాయిలో మద్దతుదారుడు కాదని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో కార్యదక్షతకు గుర్తింపు దక్కడం లేదని. మనమంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. 

చదవండి: టెస్లా ఉద్యోగులకు ఎలాన్‌మస్క్‌ ఝలక్‌! ఇకపై అలాంటి పనులు కుదరవ్‌!!

మరిన్ని వార్తలు