Tesla S Plaid : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ కార్‌

11 Jun, 2021 13:42 IST|Sakshi

2 సెకన్లలో 96 కి.మీ వేగం

మెర్సిడెజ్‌, పోర్షేలకు గట్టి పోటీ

ఎస​ ప్లెయిడ్‌ గరిష్ట వేగం 322 కి.మీ

15 నిమిషాల ఛార్జింగ్‌తో 301 కి.మీ ప్రయాణం

కొత్త మోడల్‌ రిలీజ్‌ చేసిన టెస్లా

కాలిఫోర్నియా : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ కార్‌ని రిలీజ్‌ చేసింది టెస్లా కంపెనీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం రాత్రి జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లో టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ కారుని ప్రపంచలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ కారుగా టెస్లా ఫౌండర్‌ ఎలన్‌ మస్క్‌ అభివర్ణించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్షే కంటే వేగంగా  వోల్లో కంటే భధ్రమైన కారుగా ఎస్‌  ప్లెయిడ్‌ని పేర్కొన్నారు.  

2 సెకన్లలో
టెస్లా నుంచి ఫ్లాగ్‌షిప్‌ లగ్జరీ సెడాన్‌ కారుగా ఎస్‌ ప్లెయిడ్‌ని అమెరికా మార్కెట్‌లోకి ఎంటరైంది. 1020 హెపీ హర్స్‌పవర్‌  శక్తి కలిగిన ఈ కారు కేవలం రెండు సెకన్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటలకు 322 కిలోమీటర్లు. ప్రస్తుతం అమెరికాలోనే ఈ కారు లభిస్తోంది. ఈ కారు ధర 1,29,990 (రూ. 94 లక్షలు) డాలర్లుగా ఉంది. 

కాఫీ తాగేలోపు
ఎలక్ట్రిక్‌ కార్లకు ఉన్న ప్రధాన సమస్యైన ఛార్జింగ్‌ టైం విషయంలో టెస్లా ప్రయత్నాలు ఫలించాయి. కేవలం కేవలం 15 నిమిషాల పాటు బ్యాటరీ ఛార్జీంగ్‌తో 301 కిలోమీరట్ల ప్రయాణం చేయవచ్చుని కంపెనీ పేర్కొంటోంది. కేవలం కాఫీ బ్రేక్‌ సమయంలోనే కారు తిరిగి ప్రయాణానికి సిద్థమవుతుందని ప్రకటించింది. ఈ కారులో లిథియం అయాన్‌ బ్యాటరీతో పాటు ఫాస్ట్‌ఛార్జింగ్‌ ఆప్షన్లను టెస్లా అందుబాటులోకి తెచ్చింది. 

లగ్జరీ బ్రాండ్లకు ధీటుగా
లగర్జీ కార్ల మార్కెట్లో దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తోంది టెస్లా. లగ్జరీ, పవర్‌ఫుల్‌ ఇంజన్‌ కాంబినేషన్‌లో టెస్లా రిలీజ్‌ చేసి ఎస్‌ ప్లెయిడ్‌ కారు అమెరికా మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. క్షణాల్లో రివ్వుమని దూసుకుపోయే వేగం, అద్వీతీయమైన లగ్జరీ ఫీచర్లలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ మారింది. 

చదవండి: అదిరే అల్కాజర్, స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో మార్కెట్లో సంద‌డి

మరిన్ని వార్తలు