సెకనుకు రూ.3కోట్ల ఆదాయం,మస్క్‌ ఆస్తులు కరిగిపోతున్నాయా!

16 Mar, 2022 17:15 IST|Sakshi

ఒక్కసెకనుకు మూడుకోట్ల ఆదాయం గడించే స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయా? ఆస్తులు కరిగిపోవడంతో దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఎలన్‌ మస్క్‌ మాజీ భార్య, ప్రముఖ కెనడీయన్‌ సింగర్‌ గ్రిమ్స్‌(క్లెయిర్‌ బౌచర్‌). 

ఇటీవల ఎలన్‌ మస్క్‌ మాజీ భార్య గ్రిమ్స్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎలన్‌ మస్క్‌ కొన్ని సార్లు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలన్‌ బిలియనీర్‌లాగా జీవించడు. కొన్ని సార్లు దారిద్య్ర రేఖకు దిగువన గడుపుతారు అంటూ లాస్‌ ఏంజెల్స్‌లో ఎలన్‌ మస్క్‌ తో గడిపిన రోజుల్ని గ్రిమ్స్‌ గుర్తు చేసుకున్నారు. 

ఆ వ్యాఖ్యలు తరువాత ఎలన్‌ మస్క్‌ ఆస్తులు ఎంత ఉన్నాయనే అంశంపై పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం..బెల్‌-ఎయిర్‌లోని లాస్‌ ఏంజిల్స్‌ పరిసరాల్లో తనకున్న మొత్తం ఏడు ఇళ్లను జూన్‌ 2020 నుంచి నవంబర్‌ 2021 మధ్య కాలంలో మొత్తం 127.9 మిలియన్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆస్తుల అమ్మకంపై ఎలన్‌ మస్క్‌ మే1,2020న ట్వీట్‌ చేశారు. భౌతిక ఆస్తులన్నీ అమ్మేస్తున్నాను. కానీ జీన్‌ వైల్డర్‌లో ఉన్న పాత ఇంటిని మాత్రం అమ్మదలుచు కోలేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒక్కసెకనుకు మూడు కోట్ల ఆదాయం 
అవును మీరు వింటున్నది నిజమే ఎలన్‌ మస్క్‌ ఆదాయం ఒక్కసెకనుకు మూడు కోట్ల ఆదాయం. ప్రపంచ కుబేరుల్లో నెంబర్‌. అతని ఆదాయం ఒక్క సెకనుకు మూడుకోట్లు. నిమిషానికి 188కోట్లు. గతేడాది అక్టోబర్‌ 25 సోమవారం రోజు అతని ఆదాయం ఒక్కసారి 14.5శాతం పెరిగింది. దీంతో అప్పటి వరకు తనకు పోటీ ఇచ్చిన కుబేరుల్ని వెనక్కి నెట్టి ఫస్ట్‌ ప్లేస్‌కి చేరుకున్నారు మస్క్‌.

హెచ్‌గ్లోబల్‌ హోల్డింగ్‌ సంస్థ ఒకేసారి 100 టెస్లా కార్లను కొనుగోలు చేస్తామని ఆర్డర్‌ ఇవ్వడంతో.. టెస్లా షేర్లు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో ఎలన్‌ మస్క్‌ నికర సంపద 36.2బిలియన్‌ డాలర్లు ఉండగా ఇండియన్‌ కరెన్సీలో ఎలన్‌ ఆదాయం. 2.71లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. దీంతో ఎలన్‌ మస్క్‌ నాటి సంపద 289బిలియన్‌ డాలర్స్‌కు  చేరుకుంది. అంటే భారత కరెన్సీలో 21లక్షల 30వేల కోట్లు. ఇది భారత్‌లో ఒక్క ఏడాది వచ్చే రెవెన్యూ కంటే ఎక్కువ. 

మరిన్ని వార్తలు