ఎలాన్‌ మస్క్‌కు ఎంత కష్టం..ఎంత కష్టం, ట్విటర్‌ను అమ్మేస్తా..కొంటారా!

18 Dec, 2022 16:40 IST|Sakshi

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ భవిష్యత్‌ గందర గోళంలో పడింది. తాను కొనుగోలు చేసిన ధ‌ర‌కే ట్విటర్‌ను అమ్మేస్తానంటూ ఎల‌న్ మస్క్ సంచలన ప్రకటన చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ సంస్థలో ఏం జరుగుతుందో అర్ధం గాక ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. 

ఈ ఏడాది అక్టోబర్‌లో బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టి ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. కొనుగోలు అనంతరం బాస్‌ అవతారమెత్తిన మస్క్‌ ఆ సంస్థలో సమూల మార్పులు చేశారు. వాటిలో ఉద్యోగుల తొలగింపు, పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని వినియోగం లోకి తేవడం వంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆ సంస్థ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.

ఈ నేపథ్యంలో తానెంతకైతే కొనుగోలు చేశానో .. మీరు కూడా అంతే మొత్తం చెల్లించి ట్విటర్‌ను సొంతం చేసుకోండి’ అంటూ పెట్టుబడి దారులకు మస్క్‌ ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అయితే నివేదికలపై ట్విటర్‌ ప్రతినిధులు స్పందించలేదు. 

మరిన్ని వార్తలు