బిలియనీర్‌కు భారీ షాక్‌.. ఒక్క రోజులో 63వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!

21 Dec, 2022 17:30 IST|Sakshi

ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు మరో భారీ షాక్‌ ఎదురైంది.ట్విటర్‌లోని ఊహించని పరిణామాలు, టెస్లాపై ప్రభావం చూపుతున్నాయి. దెబ్బతో మస్క్ సంపద కొవ్వొత్తిలా కరుగుతోంది.

ఇటీవల, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అనే స్థానం నుంచి కిందకు పడిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్లా షేర్లు అమ్మకాలతో మస్క్‌ సంపదతో మంగళవారం ఒక్క రోజే  7.7 బిలియన్‌ డాలర్లు ( రూ.63.72 వేల కోట్లు) ఆవిరయ్యాయి. ఈ ఏడాది మస్క్‌ సంపద 122.6 బిలియన్‌ డాలర్లు తరిగిపోయింది.

ట్విటర్‌ ఎఫెక్ట్‌.. టెస్లా పై పడుతోందా?
ఏం జరుగుతోందంటే...పలు రేటింగ్ ఏజెన్సీలు తమ ధరల లక్ష్యాలను తగ్గించడంతో టెస్లా షేర్లు మంగళవారం దాదాపు 6 శాతం పడిపోయి రెండేళ్ల కనిష్ట స్థాయి $140.86కి చేరాయి. మరో వైపు మస్క్‌ దృష్టి ట్విట్టర్ వైపు ఎక్కువగా పోయిందని, ఇది టెస్లాకు హాని కలిగిస్తోందని బ్రోకరేజ్ హౌస్‌లు నమ్ముతున్నాయి. వీటితో పాటు ట్విటర్‌కు నిధులను సమకూర్చేందుకు మస్క్ మరిన్ని టెస్లా షేర్లను విక్రయించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి టెస్టా షేర్ల అమ్మకానికి కారణమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. టెస్లా బ్రాండ్ దెబ్బతింటుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారని ఓ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అదే సమయంలో, మరొక బ్రోకరేజ్ సంస్ధ ట్విట్టర్ కారణంగా మస్క్‌ పరధ్యానం టెస్లాకు ప్రమాదాన్ని పెంచుతోందని, అందుకే షేర్లు తగ్గుతోందని అభిప్రాయపడింది. ప్రస్తుతం మస్క్‌ 148 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 2 వ స్థానంలో ఉన్నారు. 161 బిలియన్‌ డాలర్లతో బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ తొలి స్థానంలో, 127 బిలియన్‌ డాలర్లతో అదానీ మూడో స్థానంలో ఉన్నారు.

చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్‌ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా?

మరిన్ని వార్తలు