ట్విటర్‌ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర వ్యాఖ్యలు!

12 Mar, 2023 10:34 IST|Sakshi

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ట్విటర్ తరహా వికేంద్రీకృత సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సాధ్యాసాధ్యాలపై మెటా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన వార్తను ట్విటర్‌లో షేర్ చేయగా ట్విటర్‌ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. 

ట్విటర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ను మెటా ప్రారంభించనున్నట్లు వచ్చిన వార్తలపై డిజీ కాయిన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ట్విటర్‌లో షిబెటోషి నకమోటో పేరుతో ఓ మీమ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్విటర్‌కు పోటీగా అలాంటి నెట్‌వర్క్‌ ప్రారంభిస్తే ఎలాన్ మస్క్‌తో విసుగు చెందిన యూజర్లు జకర్‌బర్గ్‌ను అమితంగా ఇష్టపడతారని రాశారు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ జుకర్‌బర్గ్‌ను ‘కాపీ క్యాట్’ అని సంభోదించారు. అయితే పిల్లి అని అక్షరాల్లో రాయకుండా పిల్లి ఎమోజీని ఉపయోగించారు.

ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన

ఫేస్‌బుక్‌ కసరత్తు చేస్తున్న ఈ కొత్త సోషల్ నెట్‌వర్క్‌కు ‘P92’ అనే కోడ్‌నేమ్‌ను పెట్టింది. దీనిపై అప్పుడప్పుడూ కొంతమంది తమ అభిప్రాయాలతో అప్‌డేట్‌లు ఇస్తున్నారు. కొత్త సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మెటా ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. అయితే ఇతర వివరాలేవీ ఆయన చెప్పలేదు.

మరిన్ని వార్తలు