Neuralink మనిషి మెదడులో చిప్‌ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్‌

26 May, 2023 14:14 IST|Sakshi

మనిషి మెదడులో చిప్‌ : క్లినికల్‌ట్రయల్స్‌కు అనుమతి

మస్క్‌ చెందిన న్యూరాలింక్‌కు యూఎస్‌ ఎఫ్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్‌

మేము సైతం అంటున్న ట్వీపుల్‌

మనిషి మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టే కీలక ప్రాజెక్టులో ఎలాన్‌మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌కు అమెరికా రెగ్యులేటరీ కీలక అనుమతి లభించింది. ఈ విషయాన్ని న్యూరాలింక్‌  స్వయంగా ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.  దీనిపై ట్విటర్‌లో అభినందనలువ వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: మరో సంచలనం: బ్రెయిన్‌ చిప్‌, మస్క్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ 

తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఎఫ్‌డీఏ మోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. చాట్‌జీపీటి కంటే మనుషులకు ఎక్కువ అవసర మైందంటూ ట్వీపుల్‌ వ్యాఖ్యానించారు. ఒక కొడుకుకు తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను. అభినందనలు అని ఒకరు, 

నా కొడుకు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఈ ఏడాదిలో ఉన్న అత్యుత్తమ వార్త అంటూ మరో వినియోగదారుడు న్యూరాలింక్‌ను అభినందించారు. అయితే మానవ మెదడు లోపల చిప్‌లను అమరిక, ప్రయోగాలపై వ్యతిరేక వ్యాఖ్యలున్నప్పటికీ ఈ ట్రయల్స్‌కు నన్ను  ఎంచుకోండి అంటూ  ఒక యూజర్‌ మస్క్‌కు విజ్ఞప్తి చేయడం విశేషం. 

ఈ అద్భుత ప్రయోగంలో పాల్గొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను! అని ఒక యూజర్‌ ట్వీట్‌ చేశారు. దాదాపు ఇదే ఆసక్తిని మరొకరు ప్రదర్శించగా  హ్యూమన్ క్లినికల్ ట్రయల్ కోసం రిక్రూట్‌మెంట్ ఇంకా మొదలు పెట్టలేదనీ, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలో ప్రకటిస్తామని న్యూరాలింక్ సమాధాన మిచ్చింది. 
మరిన్ని ఇంట్రస్టింగ్‌వార్తలకోసం చదవండి సాక్షి బిజినెస్‌

మరిన్ని వార్తలు