Elon Musk మరో ప్రైవేట్‌ జెట్‌కు ఆర్డర్‌: ఖరీదెంతో తెలుసా?

3 Nov, 2022 10:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌ టేకోవర్‌ తరువాత టెస్లా సీఈవో, ఎలాన్‌ మస్క్‌ పలు సంచలనాలతో  పూటకో రీతిగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ విమానాన్ని ఆర్డర్‌ చేశారన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. సరికొత్త టాప్-ఆఫ్-లైన్ ప్రైవేట్ జెట్, గల్ఫ్‌స్ట్రీమ్ జీ700ని ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. 2023 ప్రారంభంలో ఇది మస్క్‌ చేతికి అందనుందని అంచనా.  దీని ధర 78  మిలియన్‌ డాలర్లు (646 కోట్ల రూపాయలకు పైనే) పలు నివేదికలు వెల్లడించాయి .

ఇదీ  చదవండి: ElonMusk మామ మరో బాంబు: రోజుకు12 గంటలు, ఆఫీసులోనే నిద్ర!

ఆస్టోనియాలోని ఒక నివేదిక ప్రకారం ప్ర‌పంచం బిలియనీర్‌ మస్క్‌ ‘జీ700’ సూపర్‌ జెట్‌ను కొనుగోలు చేశారు. గల్ఫ్‌స్ట్రీమ్‌కు చెందిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ విమానం 57 అడుగుల కంటే ఎక్కువ క్యాబిన్ పొడవుతో గరిష్టంగా 7,500 నాటికల్ మైళ్ల పరిధిని కలిగి ఉంది. ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండానే విమానం ఆస్టిన్‌ నుంచి హాంకాంగ్‌కు దూసుకుపోగలదు.

అమెరికన్ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం, జీ700 అనేది ఇండస్ట్రీలోనే అతిపెద్ద, విశాలమైన క్యాబిన్‌తో అత్యంత ఆధునిక ఆవిష్కరణ. అలాగే సరికొత్త, హై-థ్రస్ట్ రోల్స్ రాయిస్ ఇంజిన్‌లు,  విశిష్టమైన సిమెట్రీ ఫ్లైట్ డెక్‌ను ప్రత్యేక ఆకర్షణలు. సొంత వై ఫై,  28" x 21" 20 ఓవల్ విండోస్, రెండు లావెటరీలు ఇందులో ఉన్నాయి.  (ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!)

కాగా, ప్రైవేట్ జెట్‌లు అంటే మోజుప మస్క్‌ ఇప్పటికే నాలుగు జెట్‌లు సొంతం చేసుకోగా వాటిలో మూడు గల్ఫ్‌స్ట్రీమ్  తయారు చేసినవే. మస్క్‌ కొనుగోలు చేసిన తొలి జెట్‌ డస్సాల్ట్ 900B. అలాగే 2019, అక్టోబరులో మస్క్‌, G650ER అనే మరో జెట్‌ను కొనుగోలు చేశారు. ఏ ఇబ్బందీ లేకుండా సొంత విమానం ఉండడం వల్లే తాను ఎక్కువ సమయం పనిచేయగలుతున్నా అని  మస్క్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. (ఎయిర్‌టెల్‌ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు)

>
Poll
Loading...
మరిన్ని వార్తలు