2020లో ఎలోన్ మస్క్ ఎంత జీతం తీసుకున్నారో తెలుసా?

15 Aug, 2021 17:09 IST|Sakshi

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ 2020లో ఎలక్ట్రిక్-వేహికల్ కంపెనీ నుంచి ఎటువంటి జీతం పొందలేదు. మస్క్ 2020 వేతనం సున్నాకు పడిపోయింది. శుక్రవారం ఎస్ఈసీతో పంచుకున్న వివరాల ప్రకారం.. 2019లో అతని జీతం 23,760 డాలర్లు ఉంటే ఇది 2018లో 56,380 డాలర్లుగా ఉంది. "అయితే, అతను తన జీతాన్ని ఎన్నడూ తీసుకోలేదని" కంపెనీ తెలిపింది. ఎలోన్ మస్క్ అభ్యర్థన మేరకు 2019 మే నుంచి శాలరీ వివరాలను ప్రకటించట్లేదు అని కంపెనీ పేర్కొంది. 2018 నష్టపరిహార ఒప్పందం కింద మస్క్ మొత్తం శాలరీ ప్యాకేజీ స్టాక్ రూపంలో ఉంది. 

టెస్లా 16 మైలురాళ్లలో 12మైలురాళ్లను చేరుకుంటే, కంపెనీ మార్కెట్ క్యాప్ $650 బిలియన్లను తాకితే మస్క్ షేర్లు విలువ పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి టెస్లా ఆ మైలురాళ్లలో ఆరింటిని తాకినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 2020లో 650 బిలియన్ డాలర్లు దాటింది. శుక్రవారం ముగింపు నాటికి ఇది 704.81 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2018 ఒప్పందం ప్రకారం మస్క్ ధర ప్రతి షేరుకు 70.01 డాలర్లుగా ఉందని ఎస్ఈసీ ఫైలింగ్స్ తెలిపింది. టెస్లా స్టాక్ ప్రతి షేరుకు $716.70 వద్ద వారాన్ని ముగించింది. మానవులను అంగారక గ్రహం మీదకు తీసుకొనిపోవడానికి రూపొందిస్తున్న ప్రాజెక్టులో అధిక మొత్తంలో తన టెస్లా స్టాక్స్ కేటాయించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు