కుప్పకూలిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌.. కొనుగోలుకు ఎలాన్‌ మస్క్‌ సిద్ధం?

11 Mar, 2023 12:59 IST|Sakshi

యూఎస్‌ రెగ్యులేటరీ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీఐసీ) సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) ను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. అనంతరం ఆ బ్యాంక్‌ సంబంధించిన ఆస్తుల్ని సీజ్‌ చేసింది. దీంతో  2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. 

ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా గ్లోబల్‌ గేమింగ్‌ హార్డ్‌వేర్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కంపెనీ రేజర్ సీఈవో మిన్ లియాంగ్ టాన్ (Min-Liang Tan) ఓ సలహా ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు ఎస్‌వీబీని కొనుగోలు చేసి డిజిటల్‌ బ్యాంక్‌గా మార్చమని అన్నారు. అందుకు ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఎస్‌వీబీని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమేనని అర్ధం వచ్చేలా ‘నేనూ అదే ఆలోచిస్తున్నా’ అంటూ ట్విట్‌ చేశారు.  

60 శాతం పతనం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో ప్రసిద్ధి చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు యూఎస్‌ రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఎస్‌వీబీకి చెందిన 60 శాతం షేర్లు భారీగా పతనమయ్యాయి. 

చదవండి👉 దిగ్గజ బ్యాంక్‌ మూసివేత.. ప్రపంచ దేశాల్లో కలకలం!

మరిన్ని వార్తలు