తగ్గేదేలే: మస్క్‌ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!

19 Nov, 2022 13:46 IST|Sakshi

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్  ట్విటర్‌ టేకోవర్‌ తరువాత  వరల్డ్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించారు. కంటెంట్ మోడరేషన్  ప్రణాళికలను వెల్లడించారు. ట్విటర్‌ పోస్ట్‌లకు  భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది కానీ నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండదని తేల్చి చెప్పారు. విద్వేష పూరిత కంటెంట్‌ ఉన్న పోస్టులను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు.  (గుడ్‌న్యూస్‌,తొలిసారి ట్విటర్‌లో...మస్క్‌ క్లారిటీ!)

ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌, బట్‌ నాట్‌ రీచ్‌: కొత్త  పాలసీ
తాజా పాలసీ అప్‌డేట్‌లో విద్వేషపూరిత ట్వీట్లు డీబూస్ట్, డీమోనిటైజ్ చేస్తామని మస్క్ తెలిపారు. నెగెటివ్‌, హేట్‌ పోస్ట్‌లను ప్రమోట్‌ చేయమని, వాటిని మోనిటైజ్ పరిధిలోకి రావని స్పస్టం చేశారు. అలాంటి పోస్టులపై యూజర్లకు ఎలాంటి రెవెన్యూ ఉండబోదని తేల్చారు. అంతేకాదు అడ్వర్టయిజ్‌మెంట్లను కూడా నియంత్రిస్తామన్నారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని కూడా  మస్క్‌ పేర్కొన్నారు. యూజర్లు అలాంటి  ట్వీట్లను ప్రత్యేకంగా వెతికితే తప్ప దొరకవు అని వెల్లడించారు.

మరోవైపు గతంలో ట్విటర్‌లో బ్యాన్‌ చేసిన  కొన్ని ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు మస్క్‌. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై పోల్‌ పెట్టారు. అయితే ట్రంప్‌ ఖాతాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం. 

అలాగే వర్క్‌ ఫ్రం హోం రద్దుతోపాటు, ఎక్కువ పనిగంటలు పనిచేసేందుకు సిద్ధపడతారా, రాజీనామా చేస్తారా అంటూ మస్క్‌  అల్టిమేటానికి సమాధానంగా  తాజాగా 1200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. సాఫ్ట్‌వేర్ కోడ్ రాసే ఉద్యోగులు ఎవరైనా మధ్యాహ్నం శాన్ఫ్రా‌న్సిస్కోలోని కార్యాలయంలోని 10వ అంతస్తులో తనను కలవాలని మస్క్ శుక్రవారం ట్విటర్ సిబ్బందికి మెయిల్ పంపారు. (ఉద్యోగుల ఝలక్‌, ఆఫీసుల మూత: మస్క్‌ షాకింగ్‌ రియాక్షన్‌)

కాగా 44 బిలియన్‌ డాలర్ల ట్విటర్‌ డీల్‌ తరువాత సంచలన నిర్ణయాలతో అటు ఉద్యోగులను, ఇటు టెక్‌ వర్గాలను గందరగోళానికి గురిచేస్తూ విమర్శలు పాలవు తున్నా,  మస్క్‌ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్‌ పునరుద్ధరణ పేరుతో ఇప్పటికే వేలాది ఉద్యోగులను తొలగించడంపై అమెరికా  కోర్టులో కేసులు కూడా నమోదైనాయి. అంతేకాదు  మస్క్‌ అనాలోచిత నిర్ణయాలతో ట్విటర్‌ మూత పడనుందనే అంచనాలు వెల్లువెత్తాయి. అయితే ఆదివారం జరగనున్న వరల్డ్‌ కప్‌ మొదటి మ్యాచ్‌ లైవ్‌ కవరేజీ, కమెంటరీని ఎంజాయ్‌ చేయమంటూ ప్రకటించి ఈ ఊహాగానాలకు చెక్‌ పెట్టారు.

మరిన్ని వార్తలు