Donald Trump: ట్విటర్‌ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్‌ మస్క్‌

11 May, 2022 12:41 IST|Sakshi

ట్విటర్‌ కాబోయే బాస్‌ ఈలాన్‌ మస్క్‌ తన మాటల్లో పదును పెంచారు. ట్విటర్‌ పాత యాజమాన్యం వ్యవహారశైలిపై నేరుగా విమర్శలు సంధించారు. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను శాశ్వతంగా బ్లాక్‌ చేయడం సరైన నిర్ణయం కాదంటూ కుండ బద్దలు కొట్లాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సందర్భంగా క్యాపిటల్‌ హిల్‌పై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేశారు. ఆ తర్వాత ఎన్నికల సరళిని విమర్శిస్తూ ట్రంప్‌ అనేక వివాస్పద వ్యాఖ్యలు ట్విటర్‌లో చేశారు. దీంతో ట్రంప్‌ను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ట్విటర్‌ ప్రకటించింది. అయితే ఇలా ఒక వ్యక్తిని శాశ్వతంగా బహిష్కరించడం అంటే అతని వాక్‌ స్వాతంత్ర్యపు హక్కును హరించినట్టే అని ఈలాన్‌ మస్క్‌ అన్నారు. ఏదైనా విషయంలో అభ్యంతరం ఉంటే తాత్కాలిక నిషేధం విధించడం సరైన చర్యగా అభివర్ణించాడు. అలా కాకుండా శాశ్వతంగా నిషేధం విధించడం నైతికంగా తప్పన్నారు ఈలాన్‌మస్క్‌.

నిబంధనల ఉల్లంఘన పేరుతో ట్విటర్‌ నుంచి ఏ వ్యక్తిపైన అయినా శాశ​‍్వతంగా నిషేధం విధించడం సరైన పని కాదనేది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని, ట్విటర్‌ కో ఫౌండర్‌ జాక్‌ డోర్సే కూడా ఇదే తరహా అభిప్రాయం కలిగి ఉన్నాడంటూ వివరణ ఇచ్చాడు ఈలాన్‌ మస్క్‌. ఇటీవల జరిగిన ఓ వర్చువల్‌ సమావేశంలో ట్విటర్‌లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ని బ్యాన్‌ చేయడం వంటి అంశాలపై ఈలాన్‌ మస్క్‌ వివరణ ఇచ్చారు. 

చదవండి: Elon Musk: ట్రంప్‌పై ట్విట్టర్‌ నిషేధం ఎత్తేస్తానన్న మస్క్‌

>
మరిన్ని వార్తలు