ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?

15 Nov, 2022 10:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌ టేకోవర్‌ తరువాత కొత్తబాస్‌, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ వరుసగా ఉద్యోగులను తొలగించడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటికే సీఈవో సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్‌  తాజాగా ఒక ఉద్యోగిపై పబ్లిగ్గానే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆండ్రాయిడ్ యాప్‌పై వాదన నేపథ్యంలోఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్‌ ఎరిక్ ఫ్రోన్‌హోఫెర్ అనే ఉద్యోగిపై వేటు వేశారు  ఎలాన్‌ మస్క్‌. ట్విటర్‌లో ఆండ్రాయిడ్‌లో ట్విటర్  ఎందుకు  స్లో అయింది, దాని పరిష్కరించడానికి మీరు ఏమి చేసారు? అనే దానిపై  మొదలైన  వాదన వరుస ట్వీట్లలో మరింత వేడి పుంజుకుంది. ఈ  నేపథ్యంలో  ఆగ్రహానిక గురైన మస్క్‌  ​హి ఈజ్‌ఫైర్డ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. సిస్టమ్ లాక్‌ అయిన పిక్‌ను షేర్ చేసిన, ఎరిక్ తన తొలగింపును ధృవీకరించారు. దీంతో  తనను బహిరంగంగా విమర్శించే కంపెనీ ఇంజనీర్లను తొలగించే పనిలో ఉన్న మస్క్‌ తన కోపాన్ని ప్రదర్శించారంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యవహారంలో బాస్‌తో ప్రయివేటుగా మాట్లాడి ఉండి ఉండాల్సింది.. ఇలా పబ్లిక్‌గా బాస్‌తో వాదించడం తగదు అంటూ 20 ఏళ్ల అనుభవం ఉన్న మరో యాప్‌ డెవలవర్‌ ట్వీట్‌ చేశారు. అంతకు ముందు  ట్విటర్‌లో దాదాపు పదేళ్లపాటు సేవలందించిన మరో ఇంజనీర్ బెన్ లీబ్‌ని కూడా  మస్క్‌ ఇదే విధంగా తొలగించారు.

కాగా  చాలా దేశాల్లో ట్విటర్‌ నెట్‌ వర్క్‌స్లో  కావడంపై  మస్క్‌ యూజర్లకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ యాప్ స్లో అయినందుకు, ముఖ్యంగా కొన్ని దేశాలలో వినియోగదారులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ట్విటర్‌ కొనుగోలు తరువాత సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత ఇటీవల మొత్తం 5,500 కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 4,400 మందిని ఎలాంటి ముదస్తు నోటీసు లేకుండానే  నిలిపివేశారు. 

మరిన్ని వార్తలు