Elon Musk: ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు.. ఫ్రెండ్స్‌ ఇళ్లలోనే ఉంటా

19 Apr, 2022 10:28 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ సంచలన విషయాలు చెప్పారు. ఇప్పటికీ తనకు సొంత ఇళ్లు లేదంటూ టెడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దాదాపు ఆర్నెళ్లుగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలన్‌మస్క​ కొనసాగుతున్నాడు.

కుబేరుడు
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. పేపాల్‌తో మొదలైన అతని వ్యాపార సామ్రాజ్యం టెస్లాతో ఊహించని స్థాయికి చేరింది. తాజాగా స్పేస్‌ఎక్స్‌తో భవిష్యత్తులో కూడా తనను ఎవరూ టచ్‌ చేయలేనంతగా సంపదను పోగేసుకోబోతున్నాడు. ఇటీవల రెండు బిలియన్‌ డాలర్ల సొమ్ముతో ట్విటర్‌లో మేజర్‌ షేర్‌ హోల్డర్‌గా మారాడు. అంతేకాదు ఏక మొత్తంగా ట్విటర్‌ను కొనేందుకు 43 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ ఇచ్చి సంచలనం సృష్టించాడు. అలాంటి ఎలన్‌ మస్క్‌ తనకు స్వంత ఇళ్లు లేదంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఫ్రెండ్స్‌ ఇళ్లలో
టెడ్‌  ఇంటర్వ్యూలో మోడరేటర్‌ క్రిస్‌ అండర్సన్‌తో ఎలన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ నాకు సొంత ఇళ్లు లేదు. నేను స్నేహితుల ఇళ్లలోనే ఉంటా. టెస్లా ఇంజనీరింగ్‌ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు తరుచుగా వెళ్తుంటా. అలా వెళ్లిన సందర్భాల్లో నా ఫ్రెండ్స్‌ ఇళ్లలో ఉండే స్పేర్‌ బేడ్‌రూమ్‌లోనే ఉంటాను అంటూ చెప్పారు ఎలన్‌ మస్క్‌.

విమానం ఉంది
పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది సొంత లగ్జరీ యాచ్‌లను సమకూర్చుకుంటు ఉంటారు. కానీ నాకు అలాంటి యాచ్‌లు ఒక్కటి కూడా లేవు అసలు నా వ్యక్తిగత ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఖరీదైనది ఏదైనా ఉంది అంటే అది ప్లేన్‌ మాత్రమే. నాకంటూ సొంత విమానం లేకుంటే నేను పని చేసే సమయం కూడా చాలా తగ్గిపోయేది. విమానాల్లో వేగంగా ప్రయాణించడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. అది నేను మరింతగా పని చేసేందుకు ఉపయోగపడుతుందంటూ చెప్పాడు ఎలన్‌ మస్క్‌.

విశేషమే
చాలా మంది మిలియనీర్‌ దశలోనే సొంతంగా విల్లాలు కొనుకుంటారు. బిలియనీర్‌ క్లబ్‌లో చేరగానే యాచ్‌లు, దీవులను సొంతం చేసుకుని లగ్జరీ ఇళ్లులు నిర్మించుకుంటారు. కానీ ఎలన్‌ మస్క్‌ ఇందుకు విరుద్ధం. తన సంపద అంతా మళ్లీ ఏదో ప్రాజెక్టు మీద ఖర్చు చేయడం తప్పితే వ్యక్తిగత అంశాలకు కేటాయించకపోవడం విశేషం. గతంలో ఆయనకు పేరిట ఉన్న ఇళ్లను సైతం అమ్మేశారు. ఇకపై సొంత ఇళ్లు ఉంచుకోదలచుకోలేదు అని  2020 మేలో ప్రకటించారు. అన్నట్టుగానే రెండేళ్లలో ఆయన సంపద ఎంతో పెరిగినా మరో ఇళ్లు కొనలేదు.

చదవండి: Elon Musk: నేను ట్విటర్‌ సొంతం చేసుకుంటే వాళ్లకు జీతం ఉండదు!

మరిన్ని వార్తలు