Elon Musk: ట్విటర్‌ సీఈఓగా రాజీనామా చేస్తా.. కానీ అలాంటి వారు దొరకాలి: ఎలాన్‌ మస్క్‌

22 Dec, 2022 14:50 IST|Sakshi

ట్విట్టర్‌ సీఈవో పదవి నుంచి తప్పుకునే అంశంపై ఎలాన్‌ మస్క్‌ ఎట్టకేలకు స్పందించారు. ‘ఆ పదవిని చేపట్టేంత మూర్ఖత్వం ఉన్నవారెవరైనా దొరికిన వెంటనే నేను తప్పుకుంటా. కేవలం సాఫ్ట్‌వేర్, సర్వర్‌ టీమ్‌లను చూసుకుంటా‘ అంటూ మస్క్‌ ట్వీట్‌ చేశారు. తాను ట్విట్టర్‌ హెడ్‌గా కొనసాగాలా వద్దా చెప్పండంటూ మస్క్‌ ట్విటర్‌లో రెండు రోజుల క్రితం పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇందులో 57.5% మంది ఆయన తప్పుకోవాలంటూ ఓటు వేశారు. అయితే ఓటింగ్‌ ఫలితాలపై తక్షణం మాట్లాడనని మస్క్‌ 2 రోజుల తర్వాత స్పందించారు. అక్టోబర్‌లో ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు టేకోవర్‌ చేసినప్పట్నుంచి కంపెనీ చీఫ్‌ బాధ్యతల్లో ఆయనే కొనసాగుతున్నారు. టేకోవర్‌ తర్వాత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌తో పాటు సగం పైగా సిబ్బందిని తొలగించడంతో పాటు మస్క్‌ కంపెనీలో పలు మార్పులు, చేర్పులు చేస్తున్నారు.

చదవండి: యూజర్లకు భారీ షాక్‌, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్!

మరిన్ని వార్తలు