Tesla Shares: ఎలన్‌ మస్క్‌ దెబ్బకు.. వారంలో రూ.13 లక్షల కోట్లు ఆవిరి

14 Nov, 2021 14:47 IST|Sakshi

క్షణాలలో లక్షల కోట్లు సంపాదించాలన్నా.. నిమిషాల్లో అంతే సంపదను ముంచేయాలన్నా అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌కి చిటికేసినంత పని. గతంలో ‘ట్వీట్ల’ ద్వారానే అలాంటి పనులు చేసేవాడు. అలాంటిది తన చేష్టలతో ఈసారి టెస్లా కొంపముంచుతున్నాడు. ఈవీ దిగ్గజం టెస్లా షేర్లు ప్రస్తుతం అమెరికన్‌ మార్కెట్‌లో పతనం దిశగా దూసుకుపోతున్నాయి. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ చేష్టల వల్లే ఈ పతనం మొదలుకావడం విశేషం. సుమారు 6.9 బిలియన్‌ డాలర్ల విలువైన తన పది శాతం వాటా ఎలన్‌ మస్క్‌ అమ్మేసుకున్న విషయం తెలిసిందే. ఈ మరుక్షణం నుంచే టెస్లా షేర్ల విలువలు పడిపోతూ వస్తున్నాయి. 

ఎలన్‌ మస్క్‌ తన ట్రస్ట్ వద్ద ఉన్న 1.2 మిలియన్ షేర్లను $1.2 బిలియన్లకు విక్రయించాడు. టెస్లాలో తన వాటాలోని షేర్లలో 10 శాతం(17 మిలియన్‌ షేర్లు) అమ్మకానికి ఉంచాలనుకుంటున్నట్లు గత శనివారం ఆయన ట్వీట్‌ పోల్‌ ద్వారా ఫాలోవర్స్‌ ఒపినీయన్‌ కోరారు. ఎక్కువ మంది ఆ పోల్‌కు సమ్మతి తెలపడంతో.. ఇప్పటివరకు 6.36 మిలియన్‌ షేర్లు అమ్మేశాడు. సో.. మరో 10 మిలియన్‌ షేర్లు అమ్మేస్తే తను అనుకున్నది పూర్తవుతుంది. టెస్లా ఇంక్ షేర్లు శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 2.8 శాతం పడిపోయిన టెస్లా షేర్లు, 1,033.42 డాలర్‌ వద్ద ముగిసింది. 

టెస్లాకు రూ.13 లక్షల కోట్ల నష్టం
2003లో కంపెనీ స్థాపించబడిన తర్వాత మస్క్ ఇంత పరిమాణంలో తన వాటాను అమ్మేయడం ఇదే మొదటిసారి. టెస్లా షేర్లు ఈ వారం 15.4% పడిపోయి మార్కెట్ విలువలో సుమారు $187 బిలియన్ల(రూ.1,39,02,51 లక్షల కోట్లు)ను కోల్పోయింది. ఫోర్డ్ మోటార్ కో, జనరల్ మోటార్స్ కో సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ వారంలో టెస్లా షేర్లు భారీగా నష్టపోయినప్పటికి టెస్లా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన ఆటోమేకర్ సంస్థగా నిలిచింది. ఈ అమ్మకానికి ముందు స్టాక్‌ ఆప్షన్స్‌తో కలిపి ఎలన్‌ మస్క్‌కి సుమారు 23 శాతం స్టాక్‌ వాటా టెస్లాలో ఉంది. అయితే సరైన కారణాలు చెప్పకుండా ఆయన చేస్తున్న పని మార్కెట్‌ను మాత్రం కుదేలు చేస్తోంది.

(చదవండి: ఆకాశంలో అద్భుతం.. 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!)

మరిన్ని వార్తలు