ఎలాన్‌ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ, పేలిన స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌!

12 Jul, 2022 13:05 IST|Sakshi

ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టెక్సాస్‌లో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన సూపర్‌ హెవీ బూస్టర్‌ పేలింది. ఈ పరిణామం మస్క్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాయిటర్స్‌ కథనం ప్రకారం..మార్స్‌పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా ఎలన్‌ మస్క్‌ పనిచేస్తున్నాడు. ఇందుకోసం సులభంగా అతి తక్కువ ఖర్చుతో మార్స్‌, చంద్రమండలంపై మానువుడు అడుగుపెట్టేలా రీయిజబుల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌తో స్టార్‌ షిప్‌ స్పేస్‌ రాకెట్లను తయారు చేస్తున్నాడు. వాటిని ప్రయోగిస్తున్నాడు.  

ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చివరి నాటికి భూకక్ష్యలోకి పంపేందుకు స్పేస్‌ ఎక్స్‌ సంస్థ తయారు చేసిన 394 అడుగుల (120 మీటర్లు) సూపర్‌ హెవీ ఫస్ట్‌ స్టేజ్‌ బూస్టర్‌ 7 ప్రోటో టైప్‌ను టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాలు జరిపే బోకా చికా ప్రాంతంలో టెస్ట్‌ నిర్వహించింది. ఈ ప్రయోగం జరిపే సమయంలో స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ బూస్టర్‌ ఒక్కసారిగా పేలి తునాతునకలైంది. 

పేలుతున్న ఆ దృశ్యాల్ని నాసా అఫిషియల్‌ వెబ్‌ సైట్‌ లైవ్‌ టెలికాస్ట్‌  చేయగా..పేలిన 33 రాప్టార్‌ ఇంజిన్‌లతో తయారు చేసిన రాకెట్‌ ఎందుకు పేలిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎలన్‌ మస్క్‌ సైతం రాకెట్‌ పేలుడిపై స్పందించాడు. యా. ఇది మంచిది కాదు. రాకెట్‌ పేలుడు నష్టాన్ని స్పేస్‌ ఎక్స్‌ టీం అంచనా వేస్తుందని ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు