SpaceX: అంతరిక్ష యానంలో సరికొత్త అధ్యయం.. ఇన్‌స్పిరేషన్‌-4 విజయవంతం

19 Sep, 2021 08:09 IST|Sakshi

గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా
బొందితో జయించి మరల
భువికి తిరిగి రాగలిగే

              మానవుడే మహనీయుడు..


తల్చుకుంటే మనిషి  సాధించలేనిది ఏదీ లేదు. గత కొన్నేళ్లుగా పోటాపోటీ  అంతరిక్ష పరిశోధనలతో అగ్రపథాన దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రైవేట్‌ ఏజెన్సీ స్పేస్‌ఎక్స్‌ ‘ఇన్‌స్పిరేషన్‌4’.. చరిత్ర సృష్టించింది.  నలుగురు.. అదీ వ్యోమగాములు కానీ వాళ్లు, ఎలాంటి శిక్షణ లేనివాళ్లతో అంతరిక్ష యానం పూర్తి చేయించి..  సురక్షితంగా భూమికి చేర్చడం ద్వారా అంతరిక్షయానంలో కొత్త అధ్యయం లిఖించింది. 

 క్లిక్‌: బ్రాన్సన్‌, బెజోస్‌లది ఉత్తుత్తి ఫీట్‌.. మస్క్‌ దమ్మున్నోడు!

సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన SpaceX Inspiration ప్రయోగం విజవంతంగా పూర్తైంది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా బుధవారం రాత్రి 8గం.2ని. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన #Inspiration4 బృందం.. మూడు రోజులపాటు అంతరిక్షంలోనే గడిపింది. తిరిగి డ్రాగన్‌ క్యాప్సూల్‌ ద్వారా శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడా సముద్ర భాగాన ల్యాండ్‌ అయ్యింది క్రూ.  బృందంలోని నలుగురు ఆరోగ్యవంతంగా ఉండగా.. వాళ్లను మరికొన్ని గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉంచనున్నారు. అయితే ఏమాత్రం శిక్షణ లేని ఈ నలుగురిని అంతరిక్షంలోకి పంపి.. తద్వారా స్పేస్‌ టూరిజానికి కొత్త తోవ చూపించాడు ఎలన్‌ మస్క్‌.


200 మిలియన్ల డాలర్లు..
స్పేస్‌ఎక్స్‌ ఇన్‌స్పిరేషన్‌4కి ఎంత ఖర్చు అయ్యిందనేది స్పష్టత లేదు. కానీ, ఈ ప్రయోగ ముఖ్యోద్దేశం..  సెయింట్‌ జూడ్‌ ఆస్పత్రి క్యాన్సర్‌ పరిశోధనల కోసం 200 మిలియన్‌ డాలర్ల సేకరణ. ఫండ్‌ రైజింగ్‌ ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టాలన్నది ఎలన్‌మస్క్‌, ఆ నలుగురు స్పేస్‌ టూరిస్టుల ఉద్దేశం. ప్రస్తుతం అది 154 మిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది.  బిలియనీర్‌,  షిఫ్ట్‌ పేమెంట్స్‌ వ్యవస్థాపకుడు  జేర్డ్‌ ఐసాక్‌మాన్‌ నేతృత్వంలోని క్రిస్‌ సెంబ్రోస్కి(యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెటరన్‌), సియాన్‌ ప్రోక్టర్‌(జియోసైంటిస్ట్‌), హాయిలే ఆర్కేనాక్స్‌(అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్‌ అమెరికన్‌)లతో కూడిన టీం 71గంటల అంతరిక్ష యానం పూర్తి చేసుకుంది. వీళ్లంతా స్ఫూర్తిదాయకమైన నేపథ్యం ఉన్నవాళ్లే. అందుకే ఈ ప్రయోగానికి ఇన్‌స్పిరేషన్‌ అనే పేరు పెట్టాడు ఎలన్‌ మస్క్‌. అనంతరం డ్రాగన్‌ క్యాప్సూల్స్‌ ద్వారా భూమికి చేరుకున్న బృందం..  రెండు సెట్ల పారాషూట్స్‌తో సురక్షితంగా సముద్ర భాగంలో ల్యాండ్‌ అయ్యింది.
 

పాటలు వింటూ..
ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్‌షిప్‌లో గడిపారు.  అంతరిక్షంలో ఉన్నంతసేపు.. సైంటిఫిక్‌ చేసింది ఇన్‌స్పిరేషన్‌4 టీం. స్పేస్‌లో మనిషి శరీరం ఎలా ఉంటుదనే అంశంపై ఫోకస్‌ చేస్తూ పరిశోధనలు చేశారు వాళ్లు. మధ్యమధ్యలో సంగీతం వింటూ.. కుపోలా(క్యాప్సూల్స్‌లోని స్పెషల్‌ విండో) ద్వారా కుటుంబ సభ్యులతో ఛాటింగ్‌ చేస్తూ సరదాగా గడిపారు. ప్రోక్టర్‌ ఏకంగా మెటాలిక్‌ మార్కర్స్‌తో ఆర్ట్‌ వర్క్‌ వేయడం విశేషం.  ఇక సెంబ్రోస్కి ఏకంగా గిటార్‌ వాయించారు. వీటిని ఫండ్‌ రైజ్‌లో భాగంగా వేలం వేయనున్నారు కూడా.


స్పేస్‌ టూరిజంలో కొత్త ఒరవడి సృష్టించిన స్పేస్‌ఎక్స్‌.. ఇన్‌స్పిరేషన్‌4 ప్రయోగంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా మరో ఐదు ప్రైవేట్‌ మిషన్ల కోసం కాంట్రాక్ట్ చేసుకుంది. వీటితో పాటు నాసాకు సంబంధించిన మిషన్స్‌ సైతం ఉండగా.. ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్‌తో కలిసి పని చేయాల్సి వస్తుండడం విశేషం.


చదవండి:  జెఫ్‌బెజోస్‌ దెబ్బకు దిగివచ్చిన నాసా..!

మరిన్ని వార్తలు