మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌

3 Feb, 2021 14:28 IST|Sakshi

టెక్సాస్: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ తన మార్స్‌ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ "స్సేస్‌ ఎక్స్"‌ హెవీ లిఫ్ట్‌ రాకెట్‌ స్టార్‌షిప్‌ నమూనా రూపొందించారు. ఈ నమూనాలో భాగంగా స్టార్‌షిప్ రాకెట్ లను పరీక్షిస్తున్నారు. తాజాగా టెక్సాస్‌లోని బోకా చికా నుంచి మంగళవారం ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌ ఎస్ఎన్9 రాకెట్ ల్యాండ్‌ అవుతుండగా పేలిపోయింది. ఇంతక ముందు కూడా డిసెంబర్ నెలలో ఎస్ఎన్8 స్టార్‌షిప్ రాకెట్ కూడా పేలిపోయింది. టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌షిప్‌ కక్ష్యలోకి అధిరోహించి కిందకు భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో 6 నిమిషాల 26 సెకన్ల వ్యవధి తర్వాత పేలిపోయింది.(చదవండి: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్!)

స్సేస్‌ ఎక్స్ యొక్క స్టార్‌షిప్‌ రెండు రాకెట్ లు వరుసగా పేలిపోయాయి. ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన ఈ స్పేస్‌ ఎక్స్‌ సంస్థ.. భవిష్యత్‌ రోజుల్లో మార్స్‌ మిషన్‌, అంతరిక్షంలోకి మానవులను, 100 టన్నుల సరుకులను తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేస్తున్న హెవీ-లిఫ్ట్ రాకెట్‌ నమూనా ఇది. సెల్ఫ్‌ గైడెడ్, 16 అంతస్తుల ఎత్తైన రాకెట్.. ప్రారంభంలో స్టార్‌షిప్‌ రాకెట్ ఎలాంటి సమస్య లేకుండా లాంచ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లింది. 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఈ వ్యోమనౌక కొద్దిసేపు అది గాలిలోనే ఉండిపోయింది. ఈ సమయంలో దాని ఇంజిన్లను ఆపివేసి, ఏరోడైనమిక్ పద్దతిలో భూమిపైకి తిరిగి దించడానికి "బెల్లీ-ఫ్లాప్" ట్రిక్ ను అమలు చేశారు. తిరిగి కిందకు వచ్చేటప్పుడు నేరుగా దించడానికి ప్రయత్నించినప్పుడు సమస్యలు మొదలయ్యాయి. కుప్పకూలే సమయంలో రాకెట్‌లో వేగం పెరిగినట్లు ఫుటేజీ ద్వారా అర్ధమవుతున్నది. ఈ రాకెట్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు