Elon Musk: భారత్‌ దెబ్బకు..దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌..!

4 Dec, 2021 19:24 IST|Sakshi

స్టార్‌లింక్‌ ద్వారా​ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను ప్రవేశపెట్టాలనే టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌కు భారత్‌ గట్టిషాకిచ్చింది. స్టార్‌లింక్‌ సేవలను ఎవరు ప్రీ ఆర్డర్స్‌ చేయవద్దని కేంద్రం తెలిపింది. దీంతో భారత్‌లో ప్రీ ఆర్డర్స్‌ను నిలిపివేస్తూ స్టార్‌లింక్‌ నిర్ణయం తీసుకుంది.

లైసెన్స్‌కు రెడీ..!
లైసెన్స్‌ లేకుండా స్టార్‌లింక్‌ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని స్టార్‌లింక్‌ వెనక్కి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలన్‌ మస్క్‌ దారికొచ్చినట్లుగా కన్పిస్తోంది. ఎట్టకేలకు భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలను అందించేందుకుగాను  వాణిజ్య లైసెన్స్ కోసం వచ్చే ఏడాది జనవరి 31లోపు  దరఖాస్తు చేసుకోనుందని స్టార్‌లింక్‌ ఇండియా హెడ్  సంజయ్‌ భార్గవ లింక్డ్‌ఇన్‌లో పేర్కొన్నారు. 

ఏప్రిల్‌ నుంచి భారత్‌లో సేవలు..
ఏప్రిల్ నాటికి స్టార్‌లింక్‌ తన సేవలను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎలాంటి అవాంతరాలు లేకుంటే డిసెంబర్ 2022 నాటికి దేశవ్యాప్తంగా 2 లక్షల సబ్‌స్క్రిప్షన్లను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు భార్గవ తెలిపారు. వీటిలో సుమారు 80 శాతం మేర  గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేలా కంపెనీ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే స్టార్‌లింక్ భారత్‌లో 5,000 వరకు ప్రీ ఆర్డర్స్‌ను పొందింది. 
చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..! 20 శాతం క్యాష్‌బ్యాక్‌..! ఎలా పొందాలంటే..!

మరిన్ని వార్తలు