Elon Musk: టెస్లా కార్ల కంటే పెద్ద బిజినెస్‌ అదే అవుతోంది: ఎలన్‌ మస్క్‌

27 Jan, 2022 13:02 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లతో ఎలన్‌ మస్క్‌  సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థానాన్ని కైవసం టెస్లా చేసుకుంది. టెస్లా కార్ల వ్యాపారం ఎలన్‌ మస్క్‌కు భారీ లాభాలను తెచ్చే వ్యాపారంగా నిలుస్తోంది. కాగా రానున్న రోజుల్లో టెస్లా కార్ల వ్యాపారం కంటే ఆప్టిమస్‌ హ్యూమన్‌ రోబోట్‌ బిజినెస్‌ అత్యంత శక్తివంతమైన వ్యాపారంగా నిలుస్తోందని ఎలన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు. 

2022లో పూర్తి అధిపత్యం దానిదే..!
2022లో ఆప్టిమస్ హ్యూమన్ రోబోట్ అత్యంత కీలకం కానుందని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తెలిపాడు. టెస్లా పెట్టుబడిదారుల సమావేశంలో బుధవారం రోజున మాట్లాడుతూ... హ్యూమనాయిడ్‌ రోబోట్‌ గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని అన్నారు. రాబోయే కాలంలో యునైటెడ్ స్టేట్స్‌లో కార్మికుల కొరత సమస్యను హ్యూమనాయిడ్ రోబోలు పరిష్కరించగలవని ఎలన్‌ మస్క్‌ వెల్లడించాడు. ఒక అడుగు ముందుకేసి టెస్లా కార్ల వ్యాపారం కంటే ఆప్టిమస్‌ హ్యుమనాయిడ్‌ రోబోట్‌ బిజినెస్‌ గణనీయమైన స్ధాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తపరిచారు.


 

ఆప్టిమస్‌ హ్యుమనాయిడ్‌ రోబోట్‌..!
ఆప్టిమస్‌ హ్యుమనాయిడ్‌ రోబోటో ప్రాజెక్టును ఎలన్‌ మస్క్‌ అత్యంత క్రీయశీలకంగా పరిగణించాడు. ఈ ప్రాజెక్టు గురించి గత ఏడాది ఆగస్టులో ప్రకటించాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రమాదకరమైన, పునరావృతమయ్యే  పనులను నుంచి ఉపశమనం పొందేందుకు, రోబోటోను టెస్లా నిర్మించనుంది. వాయిస్ కమాండ్‌ ద్వారా ఈ రోబోట్‌ పనిచేయనుంది. 2022లో ఆప్టిమస్‌ హ్యుమనాయిడ్‌ రోబోట్‌ నమూనాను ప్రదర్శిస్తానని ఎలన్‌ మస్క్‌ వాగ్దానం చేశాడు.

చదవండి: తిక్క కుదిరిందా ఎలన్‌ మస్క్‌? అదిరిపోయే పంచ్‌ !

మరిన్ని వార్తలు