Elon Musk: 2008లో టెస్లా కార్లపై ఎలన్‌ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్‌

28 Oct, 2021 14:50 IST|Sakshi

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిగ్గా మారారు. స్టాక్‌ మార్కెట్‌లో టెస్లా కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూ రూ. 75 లక్షల కోట్లకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో  2008 లో టెస్లా కార్ల గురించి ఎలన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎలన్‌ నువ్వు అసాధ్యుడివయ్యా. అనుకుంటే ఏదైనా చేస్తావ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

అధఃపాతాలానికి పడిపోతున్నాడంటూ.. 
2003లో ఎలన్‌ మస్క్‌ పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ కార్లను రూపొందించాలనే ఉద్దేశంతో టెస్లా సంస‍్థను ప్రారంభించారు. 2008 నాటికి ఆ సంస్థకు ఎలన్‌ సీఈఓ అయ్యారు. ఆ సయమంలో ఈ బిజినెస్‌ టైకూన్‌ తన ఆస్తి మొత్తాన్ని టెస్లా కార్ల మీద ఇన్వెస్ట్‌ చేసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎలన్‌ ప్రయత్నాలపై పలు మీడియా సంస్థలు ఎలన్‌ ఆకాశం నుంచి అథఃపాతాళానికి పడిపోతున్నారని రాసుకొచ్చాయి. ఆ కథనాలపై ఎలన్‌ తనదైన స్టైల్లో స్పందించారు.      

భారీ పెట్టుబడులు పెడితేనే తక్కువ ధరకే  ప్రొడక్ట్‌లను అందించగలం
కొత్త టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారంటే దాన్ని అందిపుచ్చుకోవడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం టెస్లా విషయంలో ఇదే జరుగుతుంది. కనీస వేతనాలతో దాదాపుగా వాలంటీర్‌లా పనిచేస్తున్నాం. 'ఇక్కడ మరో క్లిష్టమైన విషయం  తక్కువ ధరకే కార్లను అందించాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు ల్యాప్‌ట్యాప్‌లు. తొలిసారి ల్యాప్‌ట్యాప్‌ లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ల్యాప్‌ట్యాప్‌లను  తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే 2008లో ఎలన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోల్ని టెస్లా సిలికాన్ వ్యాలీ క్లబ్ అనే ట్విట్టర్‌ అకౌంట్‌ వీడియోని షేర్‌ చేసింది.@elonmusk 2008లో ఎలక్ట్రిక్ వాహనాల గురించి చర్చించారంటూ ఎలన్‌కు ట్యాగ్‌ చేసింది. ఆ వీడియో క్లిప్‌ను 2.6 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోపై ఎలన్‌ కూడా స్పందించారు. అయితే ఈ వీడియోలపై చాలా మంది నెటిజన్లు మస్క్ స్ఫూర్తిని కొనియాడారు. ఎప్పటికీ మా ఇన్స్పిరేషన్‌ మీరేనంటూ ప్రశంసించారు. ఆయ దూరదృష్టిని కొనియాడారు.  

75 లక్షల కోట్లు దాటింది


ఆటోమొబైల్‌ రంగంలో టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ అరుదైన ఫీట్‌ను సాధించారు. వందల ఏళ‍్లకు పైగా ఆటోమొబైల్‌ రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీలకు షాకిచ్చారు. ఎలన్‌ మస్క్‌ అమెరికాలో రెంటల్‌ కార్‌ సర్వీసులు అందించే హెర్జ్‌ కంపెనీతో బిజినెస్‌ డీల్‌ కుదుర్చుకున్నారు. ఆ బిజినెస్‌ డీల్‌ 4.4 బిలియన్‌ డాలర్లగా ఉందని తెలియడంతో మదుపర్లు టెస్లా షేర్లపై భారీగా ఇన్వెస్ట్‌ చేశారు.  దీంతో  స్టాక్‌ మార్కెట్‌లో టెస్లా షేర్లు రివ్వున దూసుకెళ్లాయి. కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూ ఇండియన్‌ కరెన్సీలో రూ. 75 లక్షల కోట్లకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో 13ఏళ్ల క్రితం టెస్లా కార్ల గురించి ఎలన్‌ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్నాయి.

చదవండి: టిమ్‌ కుక్‌ ను..ఎలన్‌ తిట్టినంత పనిచేస్తున్నారు?!

మరిన్ని వార్తలు