ElonMusk మామ మరో బాంబు: రోజుకు12 గంటలు, ఆఫీసులోనే నిద్ర!

2 Nov, 2022 13:11 IST|Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ టేకోవర్‌ తరువాత సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహా పలు కీలక  ఎగ్జిక్యూటివ్‌లపై మస్క్‌ వేటు, ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో బ్లూటిక్‌ కోసం నెలకు 8 డాలర్ల ఫీజు  తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తాజాగా మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. రోజుకు 12 గంటలు పనిచేయాలని కొంతమంది ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాదు సిబ్బందికి ఇప్పటికే  టాస్క్‌లు  డెడ్‌లైన్స్‌ సెట్ చేశారట. అలాగే మేనేజర్‌ స్థాయి ఉద్యోగులు  వీకెండ్‌ (శుక్ర,శనివారం)లో  రాత్రి  ఆఫీసుల్లోనే నిద్రించినట్టుగా ఉద్యోగులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్‌ రిపోర్ట్‌ చేసింది.

ఇదీ చదవండి: Elon Musk క్లారిటీ: బ్లూటిక్‌ వెరిఫికేషన్‌  ఫీజు ఎంతో తెలుసా?

ఎలాన్ మస్క్ బాధ్యతలు స్వీకరించినప్పటి  నుంచి ఉద్యోగులకు వారానికి ఏడు రోజులు,  84 గంటలు పనిచేస్తున్నారని, ఇప్పటికే చాలా మంది సిబ్బంది  సాధారణం కంటే చాలా ఎక్కువ గంటలు పని చేస్తున్నారని సీఎన్‌బీసీ నివేదించింది. ముఖ్యంగా కొత్త బాస్‌ మస్క్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులపై భారీగా వేటు పడనుందన్న అంచనాల మధ్య తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. స్ప్రింట్స్  పేరుతో  వారాంతంలో పని చేయడానికి మస్క్  టీం  ఇంజనీర్లలో కొంతమందికి కోడింగ్ ప్రాజెక్ట్‌లను కేటాయించిందని ఇన్‌సైడర్ గతంలోనే నివేదించింది. (Moonlighting టెక్‌ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒ‍క్క మాటతో..!)

కాగా 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ టేకోవర్‌ తరువాత తొలగింపుల అంశం ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తోంది. అలాంటి దేమీ లేదని ఇటీవల మస్క్‌ ప్రకటించినప్పటికీ ఆందోళన కొనసాగుతోంది. అయితే ఎంతమంది సిబ్బందిని ఎప్పుడు తొలగిస్తారు,  ఏయే టీంలు ఎక్కువగా ప్రభావితమవుతాయనేది ప్రస్తుతానికి అస్పష్టం.
 

Poll
Loading...
మరిన్ని వార్తలు