Elon Musk:'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు'!

9 Jul, 2022 12:48 IST|Sakshi

ఊహించినట్లే జరిగింది. వరల్డ్‌ రిచెస్ట్‌ పర్సన్‌ ఎలన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెర్జర్‌ అగ్రిమెంట్‌ నిబంధల్ని ఉల్లంఘించిందంటూ 44 బిలియన్‌ డాలర్ల ట్విట్టర్‌ కొనుగోలు ఢీల్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎలన్‌ మస్క్‌ నిర్ణయంపై ట్విట్టర్‌ ఛైర్మన్‌ బ్రెట్ టేలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేలా చట్టపరమైన చర్యలకు దిగుతామని అన్నారు. కానీ మస్క్‌ ఏం చేశాడో తెలుసా?

'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు'అన్న చందంగా ఎలన్‌ మస్క్‌ వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ డీల్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు మస్క్‌ ప్రకటనతో టెస్లాలో పెట్టుబడిన మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మస్క్‌ మాత్రం య‌థావిధిగా తనకు సంబంధం లేనివాటిపై స్పందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రాంటర్‌ చూస్తూ ప్రసంగించే అలవాటుంది. ఎప్పటిలాగే 'రీ ప్రొడక్టివ్‌ రైట్స్‌' గురించి బైడెన్‌ ప్రాంప్టర్‌ చూస్తూ మాట్లాడుతున్నారు.ప్రసంగంతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాంప్టర్‌లో ఉన్నట్లుగా 'రిపిటీ ద లైన్‌' అనే పదాన్ని పదే పదే పలుకుతూ తడబడ్డారు. ప్రసంగం మధ్యలోనే ఆపేశారు. బైడెన్‌ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ మస్క్‌ ట్విట్‌ చేశారు. 

మస్క్‌ ఇదేం పద్దతయ్యా
2004లో సెటైరికల్‌ కామెడీ సినిమా 'యాంకర్‌ మ్యాన్‌' తెరకెక్కింది. ఆ సినిమాలోని 'రాన్ బుర్గుండి' యాంకర్‌ క్యారక్టర్‌ సీన్‌లను ట్వీట్‌ చేస్తూ.. ఎవరు టెలిప్రాంప్టర్‌ను కంట్రోల్‌ చేస్తారో వాళ్లే నిజమైన ప్రెసిడెంట్లు అని ట్విట్‌లో పేర్కొన్నారు. కానీ మస్క్‌ ట్విట్టర్‌ డీల్‌ క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ తరహా ట్విట్లు చేయడంపై మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మస్క్‌ ఇదేం పద్దతయ్యా. 'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు' తాము నష్టపోతుంటే ఈ తరహాలో​ ప్రవర్తించడం సరికాదంటున్నారు.  

వాళ్ల ఆందోనకు అర్ధం ఉంది! 
అదే సమయంలో మదుపర్ల ఆందోళనకు అర్ధం ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మదుపర్లు టెస్లాపై చేసిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవడంతో భారీగా నష్టపోయారు. టెస్లా 126 బిలయన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. కానీ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్‌ ఢీల్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు మస్క్‌ ప్రకటనతో వారికి నష్టం ఏ తరహాలో ఉంటుందోనని మదనపడుతున్నారు.

మరిన్ని వార్తలు