Twitter Bankruptcy: ఆ మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయి: ఎలాన్ మస్క్

6 Feb, 2023 14:31 IST|Sakshi

గత మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయని, ట్విటర్ దివాలా తీయకుండా కాపాడానని దాని కొత్త అధినేత ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. ట్విటర్‌, మరోవైపు టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల కార్యకలాపాలు ఏకకాలంలో పర్యవేక్షించాల్సి వచ్చిందని వివరించారు. ట్విటర్‌ వేదికగా తన భావాలను పంచుకున్న మస్క్.. ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలి ఉన్నాయన్నారు. 

 (ఇదీ చదవండి: Tech layoffs మరో టాప్‌ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్‌!)

ట్విటర్‌లో తనకు ఎదురైన కఠిన పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదన్నారు. ప్రస్తుతం ట్విటర్ ఆదాయం బ్రేక్‌ ఈవెన్ స్థితికి చేరుకుందని, ఇదే పంథా కొనసాగితే త్వరలో లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తొలి నాళ్లలో పరిస్థితుల గురించి ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. 44 బిలియన్ డాలర్లకు సంస్థను కొన్న తొలి వారంలోనే ఆదాయం భారీగా పడిపోయిందని వాపోయారు. అడ్వర్టయిజర్లపై కొందరు తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే దీనికి కారణమని వివరించారు. నాటి నుంచి తాను ఎన్నో మార్పులు తీసుకొచ్చి సంస్థను కాపాడుకున్నానని పేర్కొన్నారు. (Poco X5 Pro 5g: వచ్చేస్తోంది.. రాక్‌స్టార్‌ చేతులమీదుగా)

మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అందులో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. బ్లూటిక్‌ సర్వీస్‌ను పెయిడ్‌ సర్వీస్‌గా మార్చారు. వ్యయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది ఉద్యోగులను సైతం తొలగించారు. విలువైన వస్తువులను వేలం వేశారు. ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలను తగ్గించారు.

మరిన్ని వార్తలు