రంగంలోకి దిగిన ఎలన్‌ మస్క్‌..! దూసుకుపోయిన కరెన్సీ విలువ!

10 Jul, 2021 19:58 IST|Sakshi

వాషింగ్టన్‌: ఎలన్‌ మస్క్ ది రియల్‌ ఐరన్‌మ్యాన్‌. లక్షల కోట్లను సంపాదించాలన్నా లక్షల కోట్లను క్షణాల్లో పోగొట్టుకోవాలన్నా టెస్లా సీఈవో, స్పెస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌కే సాధ్యం. ఒక ట్విట్‌ చేస్తే చాలు..అట్టడుగున ఉన్న కంపెనీలను ఎవరు ఊహించని విధంగా కంపెనీలు లాభాలను పొందేలా చేస్తాడు ఎలన్‌ మస్క్‌. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ తలరాతను మార్చడంలో మస్క్‌ పాత్ర వివరించలేనిది. తాజాగా ఎలన్‌ మస్క్‌ చేసిన ఒక్క ట్విట్‌తో క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌ మరోసారి దశ తిరిగింది.

ఎలన్‌ మస్క్‌ శుక్రవారం వేసిన ట్విట్‌తో డాగీకాయిన్‌ విలువ సుమారు 8 శాతం మేర దూసుకుపోయింది. డాగీకాయిన్‌ ఇన్వెస్టర్‌ మ్యాట్‌ వాలస్‌ ట్విట్‌కు ఎలన్‌ మస్క్‌ రిప్లె ఇచ్చాడు. ఎలన్‌ మస్క్‌ తన ట్విట్‌లో..బిట్‌కాయిన్‌, ఎథిరియం క్రిప్టోకరెన్సీతో పొల్చితే డాగీకాయిన్‌కు హై ట్రాన్సక్షన్‌ రేటు ఉందని తెలిపాడు. అంతేకాకుండా బిట్‌కాయిన్‌, ఎథిరియం క్రిప్టోకరెన్సీలకు బహుళస్థాయి లావాదేవీ వ్యవస్థలను కల్గి ఉందని పేర్కొన్నాడు. ఈ క్రిప్టోకరెన్సీలతో ట్రాన్సక్షన్‌ జరిపితే అధికంగా ఫీజును వసూలు చేస్తోందని తెలిపాడు.

డాగీకాయిన్‌తో లావాదేవీలను జరిపితే తక్కువ టాన్సక్షన్‌ ఫీజు వసూలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ ట్విట్‌తో ఒక్కసారిగా డాగీకాయిన్‌ విలువ 8 శాతం పెరిగింది. కాగా గతంలో ఎలన్ మస్క్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రపంచ ప్రఖ్యాత హ్యాకర్ గ్రూప్ Anonymous హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎలన్ మస్క్ ను బెదరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.వీడియోలో మస్క్ తన ట్వీట్లతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల జీవితాలను నాశనం చేశాడని ఆరోపిస్తూ టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌ను హెచ్చరించారు.

మరిన్ని వార్తలు