-

బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు: మరోసారి బ్రేక్‌, ఎందుకంటే?

22 Nov, 2022 10:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరోసారి సబ్‌స్క్రిప్షన్ ఆధారిత 'బ్లూ వెరిఫికేషన్' ప్లాన్‌ను మరోసారి వాయిదా వేసుకున్నారు.  తాజాగా  'బ్లూ వెరిఫైడ్' బ్యాడ్జ్‌ పునఃప్రారంభించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. “బ్లూ వెరిఫికేషన్ రీలాంచ్‌ను ఆపివేయడం వల్ల ఫేక్ అకౌంట్ల తొలగింపుపై పూర్తి విశ్వాసం వచ్చేంత వరకు దీన్ని వాయిదా వేస్తున్నానన్నారు.

అలాగే వ్యక్తుల కోసం కాకుండా సంస్థల కోసం వేర్వేరు కలర్స్‌లో వెరిఫికేషన్‌  ఉంటే బావుంటుందేమో అంటూ మస్క్ ట్వీట్ చేశారు. అయితే  ప్పుడు రీలాంచ్‌ చేసేదీ ప్రకటించ లేదు. మరోవైపు గత వారంలో 1.6 మిలియన్ల  యూజర్లను  ట్విటర్‌ సాధించిందనీ,  ఇది "మరో ఆల్ టైమ్ హై" అని మస్క్ ట్వీట్ చేశారు.

కాగా నెలకు 8 డాలర్లు బ్లూటిక్‌ను  ఫీజును ప్రకటించిన మస్క్‌ ​ నకిలీ ఖాతాల బెడద  కారణంగా దీన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఆ తరువాత నవంబరు 29 నుంచి పునఃప్రారంభించనున్నట్టు  తెలిపారు. కానీ దీని  మరోసారి బ్రేకులు వేయడం  గమనార్హం.

మరిన్ని వార్తలు