ట్విటర్‌లో సరికొత్త ఫీచర్లు, త్వరలోనే అందుబాటులోకి

9 Jan, 2023 21:20 IST|Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫారం ట్విటర్‌ సరి కొత్త ఫీచర్లతో ముస్తాబు కానుంది. వచ్చే వారం నుంచి రానున్న కొత్త ఫీచర్లకు సంబంధించిన వివరాలను మస్క్‌ స్వయంగా ప్రకటించటం విశేషం.

కొత్త పరిణామాలపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ట్వీట్లు, బుక్ మార్కు బటన్ ఫీచర్లు  లాంటివి కొన్ని ఈ వారంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మస్క్ తెలిపారు. ఎడమవైపు .. కుడివైపు స్వైపింగ్ చేయటం, రికమండెడ్, ఫాలోడ్ ట్వీట్లను అనుసరించటం వంటి ఫీచర్లు ఈ వారంలోనే అందుబాటులోకి వస్తాయి. ట్వీట్లపైన బుక్ మార్కు కూడా అందుబాటులోకి  వస్తోంది.

వచ్చే నెలలో..
స్క్రీన్ షాట్లకు బదులు పెద్ద టెక్స్టును షేర్ చేయటం అనేది ఫిబ్రవరి మొదటివారం నుంచిసాధ్యమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబరులో మస్క్ దీని గురించి  తొలి సారిగా మాట్లాడారు.

అందుబాటులోకి రానున్న మరికొన్ని అంశాలు
మరో కొత్త  ఫీచర్‌ను కూడా అందించేందుకు ట్విటర్‌ ప్రయత్నిస్తోంది. పెద్ద టెక్ట్స్‌ ను ద్రెడ్ సాయంతో ఆటోమేటిక్ గా చిన్నగా విడగొట్టవచ్చు. ఇకపైన వారు ‘ప్లస్’ బటన్ ను ఉపయోగించవలసిన పనిఎంత మాత్రం లేదు. అలాగే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్  సెక్యూరిటీతో పంపించిన వ్యక్తి లేదా అందుకున్న వ్యక్తి తప్ప ఇతరులు దానిని రహస్యంగా చదవటానికి ఎలాంటి అవకాశం ఉండదు.   2018లోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తేవాలని ప్రయత్నించినప్పటికీ,  అమల్లోకి రాలేదు.

మరింత సృజనాత్మకంగా...
ట్విటర్ బ్లూ  యూజర్లు 60 నిముషాల పెద్ద వీడియోలను 2జీబీసైజులో ఉన్న ఫైల్స్ తో అప్ లోడ్ చేయవచ్చు. అంతకంటే పెద్ద వాటిని వెబ్ ద్వారా పంపాలి.
 

మరిన్ని వార్తలు