‘డబ్బులేం చెట్లకు కాయవ్’,లక్షల కోట్లు పెట్టి కొన్నా..ఉద్యోగులకు మస్క్‌ వార్నింగ్‌

11 Nov, 2022 13:36 IST|Sakshi

లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత తొలిసారి ఎలాన్‌ మస్క్‌ సంస్థ మొత్తం ఉద్యోగులతో సమావేశమ్యారు. ఈ సందర్భంగా ట్విటర్‌ మరిన్ని ఆదాయ మార్గాల్ని అన్వేషించకపోతే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉందని మస్క్‌ హెచ్చరించారు.  

ట్విటర్‌ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆ సంస్థలో నెలకొన్న గందర గోళం మధ్య తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో ట్విటర్‌లో సగానికిపైగా సిబ్బందిని, సీఈవో, సీఎఫ్‌వో వంటి  టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లకు పింక్‌  స్లిప్‌ జారీ చేశారు. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం మానేయమని ఆదేశించారు. 

ఇప్పుడు ట్విట్టర్‌లో సేఫ్టీ & ఇంటెగ్రిటీ  గ్లోబల్ హెడ్ యోయెల్ రోత్, సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ రాబిన్ వీలర్ కూడా ట్విటర్‌కు రాజీనామా చేశారు. కానీ మస్క్ వీలర్‌ రాజీనామాను తిరస్కరించారు. సంస్థలో కొనసాగాలని పట్టుబట్టారు. అయితే మస్క్‌ తన వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను కాపాడుకోవడానికి ఇలా చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

నో ఫ్రీ ఫుడ్‌, నో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ఉద్యోగులు ఒక్కొక్కరిగా సంస్థను వీడుతున్నా మస్క్‌ తన తీరు మార్చుకోవడం లేదు. ఉద్యోగులతో జరిపిన సమావేశంలో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి.. నేను ఏం చెబితే అది చేయాలి. డబ్బులేం చెట్లకు కాయవ్ ,లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను కొన్నా..ఉద్యోగులకు మస్క్‌ వార్నింగ్‌ ఇచ్చారు. లేదంటే సంస్థ దివాలా తీయడం ఖాయం అంటూ వారిని ఆందోళనకు గురిచేశారు.

అంతేకాదు ఇకపై మీరందరూ వారానికి 80 గంటలు పనిచేయాలి. ఫ్రీ ఫుడ్‌ తొలగింపు, ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు అందించే ప్రోత్సాహకాల తగ్గింపు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను రద్దు చేస్తున్నట్లు తెగేసి చెప్పారు. మీరు కాదుకూడదు అంటే రాజీనామాలు చేయండి. అట్రిషన్‌ గురించి అడగ్గా.. మనమందరం మరింత కఠినంగా ఉండాలి’ అని చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

చదవండి👉 ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు, ‘ట్విటర్‌ దివాలా తీయొచ్చు..నేడో..రేపో’!

మరిన్ని వార్తలు