ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం, ఎల‌న్ మ‌స్క్ కొంప‌ముంచింది!!

25 Feb, 2022 18:29 IST|Sakshi

ఉక్రెయిన్‌- రష్యా దేశాల మ‌ధ్య తలెత్తిన సంక్షోభం స్పేస్ఎక్స్ అధినేత ఎల‌న్ మ‌స్క్ కొంప ముంచింది. ఆ రెండు దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో టెస్లా షేర్ల ధ‌ర‌లు సెప్టెంబర్ నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి.

బ్లూమ్‌బెర్గ్ యొక్క బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎల‌న్ మ‌స్క్ సంప‌ద బుధవారం నాడు $13.3 బిలియన్లు తగ్గింది. ఉక్రెయిన్‌పై రష్యా జ‌రుపుతున్న కాల్పుల కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లు క్షీణించాయి.టెస్లా షేర్లు సైతం వరుసగా నాలుగు రోజుల పాటు న‌ష్ట‌పోయాయి.  

టెస్లా షేర్లు న‌ష్ట‌పోవ‌డంతో మస్క్ నికర విలువ 198.6 బిలియన్లకు ప‌డిపోయింది. సెప్టెంబ‌ర్ తర్వాత మొదటిసారిగా ఎల‌న్ మ‌స్క్ ఆస్తి 200 బిలియన్లకు దిగువన ఉంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఎల్‌వీఎంహెచ్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌లు నష్టాలను అధిగమించ‌గా.. మ‌స్క్ మాత్రం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు తన సంపద నుండి 71.7 బిలియన్లను కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ మస్క్ బెజోస్ కంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా  కొన‌సాగుతున్నారు.

చ‌ద‌వండి : డిమాండ్‌లో ఉన్న టెక్ స్కిల్స్!! అత్యధిక జీతం అందించే 'సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు' ఇవే!

మరిన్ని వార్తలు