Elon Musk: ‘ఎలన్‌ మస్క్‌..పాకిస్థాన్‌ను కొనేస్తారా...!’

30 Oct, 2021 20:34 IST|Sakshi

Elon Musk Is Wealthier Than The Entire GDP of Pakistan: టెస్లా సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ ప్రపంచ అపర కుబేరుడుగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే 36 బిలియన్‌ డాలర్లను పొందడంతో ఎలన్‌ మస్క్‌ సంపద 300 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కొద్దిరోజుల క్రితం హెర్జ్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ అనే కార్‌ రెంటల్‌ సంస్థ సుమారు లక్ష టెస్లా కార్లకు ఆర్డర్‌ చేసింది. దీంతో అక్టోబరు 25 నాటి మార్కెట్‌ ట్రేడింగ్‌లో టెస్లా కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది. ఇక ఎలన్‌ మస్క్‌ సంపద పాకిస్థాన్‌ జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రస్తుతం ఎలన్‌ మస్క్‌ నికర సంపద విలువ 311 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 220 మిలియన్ల జనాభా కలిగిన పాకిస్థాన్‌ జీడిపీ కేవలం 280 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఎలన్‌ మస్క్‌ సంపద పాకిస్థాన్‌ కంటే సుమారు 12 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉందని అమెరికాకు చెందిన కాలమిస్ట్‌ ఎడ్వర్డ్‌లూయీస్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెగ వైరల్‌గా మారింది.


ఎడ్వర్డ్‌ ట్వీట్‌కు నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ మేకర్‌, ప్రొడ్యూసర్‌ రమేష్‌ శర్మ తన రిప్లేలో.. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌ పాకిస్థాన్‌ కొనేస్తారా...అంటూ ప్రశ్నించారు. నెటిజన్లు కూడా రమేష్‌ శర్మ ట్విట్‌ను రీట్విట్‌ చేస్తున్నారు. రమేష్‌ శర్మ చేసిన ట్విట్‌కు ఎడ్వర్డ్‌ లూయిస్‌ రిప్లే ఇస్తూ...ఒక వేళ ఎలన్‌ మస్క్‌ అదే చేస్తే...అతని దగ్గర ఎమీ మిగలదు. కాగా పాకిస్థాన్‌లో చిరాకులో ఉన్న  220 మిలియన్ల ప్రజలు, ఒక మంచి టీ20 టీమ్‌ మాత్రం అతనికి లభిస్తుదంటూ ట్విట్‌ చేశారు. 
చదవండి:  రెట్రో లుక్స్‌లో కవాసకి నుంచి అదిరిపోయే బైక్‌..!

మరిన్ని వార్తలు