Elon Musk : ఫోటో షేర్‌ చేశాడో లేదో...! ఒక్కసారిగా పెరిగిన కరెన్సీ విలువ...!

13 Sep, 2021 22:11 IST|Sakshi

వాషింగ్టన్‌: క్రిప్టోకరెన్సీ విలువ పెంచడంలో లేదా తగ్గించడంలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల అధినేత ఎలన్‌ మస్క్‌ పాత్ర ఎంతగానో ఉంది. క్రిప్టోకరెన్సీపై ఎలన్‌ మస్క్‌ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాగ్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఎలన్‌ మస్క్‌ను ముద్దుగా డాగీ ఫాదర్‌ అని పిలుచుకుంటారు. ఎందుకంటే డాగ్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీ  విలువ పెరగడంలో మస్క్‌ పాత్ర ఎంతగానో ఉంది.

చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్‌ మస్క్‌ వాదనతో ఏకీభవించిన ఆనంద్‌ మహీంద్రా..!

తాజాగా ఎలన్‌ మస్క్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఫ్లోకీ వచ్చేసింది అంటూ.. షిబా ఇను అనే బ్రీడ్‌ను పెంపుడు జంతువుగా తెచ్చుకున్నట్లు షేర్‌ చేశాడు.  ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడో లేదో... డాగ్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం డాగ్‌కాయిన్ మాత్రమే కాకుండా బేబీ డాగ్‌ వంటి ఆల్ట్ నాణేలు కూడా గణనీయంగా పెరిగాయి. మస్క్‌ తన పెంపుడు జంతువును షేర్‌చేయడం...డాగ్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీ విలువ పెరగడానికి సంబంధం ఏమిటనీ ఆలోచిస్తున్నారా... దీనికి కారణం డాగ్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీ  సింబల్‌ను షిబా ఇను అనే బ్రీడ్‌ కుక్కతో చూపిస్తారు.

మరికొన్ని క్రిప్టోకరెన్సీలను కూడా ఈ బ్రీడ్‌తోనే చూపిస్తారు. షిబా ఫ్లోకీ థీమ్‌తో ఉన్న క్రిప్టోకరెన్సీల విలువ సుమారు 24 గంటల్లో  రికార్డు స్థాయిలో 958.09 శాతం మేర పెరిగింది. మరో క్రిప్టో, ఫ్లోకి ఇను గత 24 గంటల్లో 59.08 శాతం మేర ఫ్లోకి శిబా 23.46 శాతం మేర పెరిగింది. బేబీ డాగ్‌ కాయిన్‌ విలువ 1.80 శాతం జంప్‌ అయ్యింది. డాగ్‌ కాయిన్‌  గడిచిన 24 గంటల్లో +0.36 శాతం మార్పును నమోదు చేసింది.

చదవండి: VIDEO: టెస్లా సంచలనం.. విండ్‌షీల్డ్‌ ముందర కనిపించని వైపర్స్‌! ఆన్‌ చేయగానే నీళ్లకు బదులు లేజర్‌ కిరణాలు

మరిన్ని వార్తలు