అపర కుబేరులకు భారీ షాక్‌.. లక్షల కోట్ల నష్టం!

2 Jul, 2022 09:38 IST|Sakshi

కోవిడ్‌ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వాలు,సెంట్రల్‌ బ్యాంక్‌లు ఉద్దీపన చర్యలు చేపట్టడం, జాతీయ, అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో టెక్‌ కంపెనీల నుంచి క్రిప్టో కరెన్సీ వరకు ఇలా అన్నీ రంగాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వెరసి ప్రపంచ వ్యాప్తంగా 500 మంది బిలియనీర్లు కేవలం 6నెలల వ్యవధిలో 1.4 ట్రిలియన్‌ డాలర్లను నష్టపోయారు. 

బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక ప్రకారం..వరల్డ్‌ 500 రిచెస్ట్‌ బిలియనీర్లలో ఎలన్‌ మస్క్‌ తన సంపదలో దాదాపు 62 బిలియన్‌ డాలర్లు, జెఫ్‌ బెజోస్‌ 63 బిలియన్‌ డాలర్లు, మార్క్‌ జుకర్‌ బర్గ్‌ నికర సంపద  సగానికి పైగా తగ్గింది. ఇలా ప్రపంచంలో 500 మంది సంపన్నులు 2022 మొదటి 6 నెలల్లో 1.4 ట్రిలియన్ డాలర్లను కోల్పోయారు.  

కారణాలివేనా!
పాలసీ మేకర్లు ప్రస్తుతం నెలకొన్న అధిక ద్రవ్యోల్బణాన్నితగ్గించేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. దీంతో బిలియన్లు తన ఆదాయాన్ని పెద్ద ఎత్తున కోల్పోయారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ దిగ‍్గజంటెస్లా జూన్ నుండి కేవలం మూడు నెలల్లో అత్యంత దారుణమైన నష్టాల్ని చవిచూసింది. అమెజాన్‌ సైతం అదే దారిలో పయనించింది.  

అయినా వాళ్లే టాప్‌ 
ప్రప౦చ౦లోని అత్య౦త ధనవ౦తులైన ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌లు భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచ ధనవంతుల జాబితాలో వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. ఎలన్‌ మస్క్ ఇప్పటికీ 208.5 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అమెజాన్‌ బాస్‌ బెజోస్ 129.6 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

చదవండి👉 ఎలన్‌ మస్క్‌ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్‌!

మరిన్ని వార్తలు