టెస్లాకు పోటీగా మరో ఎలక్ట్రిక్ కారు 

7 Feb, 2021 17:04 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సీఈఓ కొనసాగుతున్న టెస్లాకు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో గణనీయమైన రికార్డు ఉంది. చాలా కాలం నుంచి టెస్లాకు చెందిన షేర్ ధరలతో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దింతో ఈవీ రంగంలో విపరీతమైన ఆధిపత్యం సాదించింది. కానీ, ఇప్పుడు టెస్లాకు పోటీ ఇచ్చేందుకు మరోకారు కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కొత్త కారు కంపెనీ సీఈఓ పీటర్ రావ్లిన్సన్ గతంలో టెస్లా ఎలక్ట్రిక్ తయారీలో ముఖ్య భూమిక పోషించారు.

ప్రస్తుతం టెస్లా ఈ స్థాయికి చేరుకొవడంలో ప్రధాన పాత్ర పోషించిన పీటర్ రావ్లిన్సన్. గతంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. టెస్లా నుంచి బయటకు వచ్చిన తర్వాత "లూసిడ్ మోటార్స్" అనే సంస్థను స్థాపించి ఎలక్ట్రిక్ కార్ల తయారీని మొదలుపెట్టారు. లూసిడ్ మోటార్స్ బ్రాండ్ కింద విడుదలైన మొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు టెస్లాకు దీటుగా తీసుకొచ్చినట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. తాము లగ్జరీ కార్ల తయారీ చేస్తున్నందున టెస్లాతో మాకు పోటీ లేదని పీటర్‌ రావ్లిన్సన్ పేర్కొన్నారు‌. లూసిడ్ మోటార్స్ బ్రాండ్ కింద విడుదలైన 'లూసిడ్ ఎయిర్' కారు సాంకేతికత విషయంలో టెస్లా, మెర్సిడెస్ బెంజ్, జీఎమ్ వంటి సంస్థలతో మార్కెట్లో పోటీ పడగలదని పీటర్ తెలిపారు. టెస్లా కంపెనీకి చెందిన రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న "మోడల్ ఎస్" కోసం చీఫ్ ఇంజనీర్‌గా ఒక దశాబ్దం క్రితం పని చేశారు.
(చదవండి: మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్)

మరిన్ని వార్తలు