ఇజ్రాయెల్‌ ప్రధానితో మస్క్‌: సైబర్‌ట్రక్ రైడ్‌ వీడియో వైరల్‌

19 Sep, 2023 19:43 IST|Sakshi

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం తన అమెరికా పర్యటనలో టెస్లా  సీఈవో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను కలిశారు.  ఈ సందర్భంగా  భార్య సారాతో కలిసి నెతన్యాహు నెతన్యాహుని కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీ పర్యటనకు తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మస్క్‌ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు చెందిన 'సైబర్‌ట్రక్' (ఇంకా లాంచ్‌ కాలేదు) లో సంచరించారు. ముగ్గురూ ఫ్యాక్టరీ చుట్టూ బ్యాటరీ-ఎలక్ట్రిక్ ఫుల్-సైజ్ పికప్ ట్రక్‌లో ప్రయాణించిన వీడియోను పీఎం ఆఫీసు అధికారిక (ఎక్స్‌)లో పోస్ట్‌ చేశారు.

ప్రధానమంత్రి, ఆయన భార్యకు  టెస్లా అభివృద్ది చేస్తున్న వివిధ మోడళ్లపై ఎలోన్ మస్క్ వివరించారు.అలాగే అధునాతనఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అసెంబ్లింగ్‌ లైన్‌ను పరిశీలించారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.అంతేకాదు ఏఐ వినియోగం, దాని మంచిచెడులను, ఏఐ నష్టాలను ఎలా తగ్గించవచ్చు అనే దాని గురించిచర్చించామంటూ నెతన్యాహూ ట్వీట్‌ చేశారు. 


 

మరిన్ని వార్తలు