వర్క్‌ ఫ్రం హోంకు గవర్నమెంట్‌ చెక్‌..! ఐటీ కంపెనీల నిర్ణయం ఇలా..!

12 Feb, 2022 13:36 IST|Sakshi

కరోనా రాకతో ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమవ్వగా ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రాకతో ఐటీ కంపెనీలు సందిగ్థంలో పడిపోయాయి. దీంతో చేసేదేమీ లేక ఉద్యోగులను మళ్లీ ఇంటి నుంచే పనిచేయడంటూ ఆర్డర్స్‌ వేశాయి.

భారత్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ కాస్త తగ్గిపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను ఆఫీసులకు పిలవొచ్చునని ఐటీ కంపెనీలతో తెలిపాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు మరోసారి ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. విప్రో, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను పూర్తిగా ఎత్తివేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. 

ఆఫీసులకు పిలిచేందుకు సిద్దం..!
కోవిడ్-19  తగ్గుముఖం పట్టడంతో దిగ్గజ ఐటీ కంపెనీలైన విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ తమ  ఉద్యోగులను వచ్చే నెలలోగా కార్యాలయాలకు పిలిపించే అవకాశం ఉన్నందున ఉద్యోగుల సిద్ధంగా ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. 

భారత ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమైంది. బెంగళూరుకు చెందిన కంపెనీ మేనేజర్స్‌,  సీనియర్ ఉద్యోగులను మార్చి 3లోగా కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. అయితే, ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు మాత్రమే వారిని పిలుస్తారు. ఇక ఉద్యోగులను  కూడా పూర్తి స్థాయిలో ఆఫీసులకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

► కాగ్నిజెంట్ తమ ఉద్యోగులను ఏప్రిల్ నాటికి కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తోంది. అయితే ఉద్యోగులను బలవంతం చేయకుండా వారిని పిలిచే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ సమాచారం. 2022 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను కొనసాగించాలనే అంచనాతో కంపెనీ ఉన్నట్లు సమాచారం. కాగ్నిజెంట్ ఏప్రిల్ నుంచి వారానికి 3 రోజుల పాటు ఉద్యోగులను తిరిగి ప్రాంగణంలో ఉంచే ప్రణాళికలను కలిగి ఉంది

► రిమోట్ వర్కింగ్ పాలసీని తీసుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ట్రెండ్‌లో చేరింది. కంపెనీ అసోసియేట్స్‌ ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ,  వారిని కంపెనీ బేస్ లొకేషన్ నుంచి పని చేయడం తప్పనిసరి చేసింది. టీసీఎస్ భారీ ఎత్తున్న విద్యార్థులను రిక్రూట్‌ చేసుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ది. ఇక  భ‌విష్య‌త్‌లోనూ 25-25 శాతం మోడ‌ల్ విధానాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. తొలుత 25/25 శాతం మంది సిబ్బందిని ఆఫీసుల‌కు తీసుకొచ్చి క్ర‌మంగా హైబ్రీడ్ మోడ‌ల్‌కు మ‌ళ్లిస్తామ‌ని తెలిపారు.

► ఇన్ఫోసిస్ రాబోయే 3-4 నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల కోసం కార్యాలయాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇన్ఫోసిస్‌లో 96 శాతం మంది వ‌ర్క్ ఫ్రం హోం సేవ‌లు కొన‌సాగిస్తారు. సంస్థ కూడా సిబ్బందిని ఆఫీసుల‌కు ర‌ప్పించ‌డానికి తొంద‌ర ప‌డ‌టం లేదు. కొవిడ్ కేసుల నేప‌థ్యంలో హైబ్రీడ్ మోడ‌ల్ ప‌ని విధానాన్నే కొన‌సాగిస్తామ‌ని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచ‌ర్డ్ లోబో వ్యాఖ్యానించారు. 40-50 శాతం సిబ్బందిని ఆఫీసుల‌కు ర‌ప్పిస్తామ‌న్నారు. ద‌శ‌ల వారీగా ఆఫీసుల‌కు సిబ్బందిని తీసుకొస్తామ‌న్నారు.

చదవండి: హైదరాబాద్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ఎండ్‌కార్డ్‌..! ఐటీ కంపెనీల కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు