Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన

11 Mar, 2023 18:38 IST|Sakshi

ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. లేఆఫ్స్‌ పేరుతో వరుసపెట్టి ఉద్యోగులను పీకేస్తున్నాయి. అన్ని కంపెనీల్లో ఈ సంవత్సరం 1.2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్‌పే! 

ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇండియన్‌ టెక్కీ వందన్ కౌశిక్ కూడా ఒకరు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీనియర్ ప్రోడక్ట్‌ మేనేజర్‌ అయిన ఆయన కంపెనీలో  ఎనిమిదేళ్లు పనిచేశారు. తాజా లేఆఫ్స్‌లో భాగంగా కౌశిక్‌తో పాటు తన టీం అంతటినీ కంపెనీ పీకేసింది. కౌశిక్ తన లేఆఫ్‌ అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. కంపెనీలో తాను ఏయే బాధ్యతలు నిర్వహించిందీ.. తన టీం తనకు ఎలా సహకరించిందీ వివరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: రైళ్లలో సూపర్‌ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే! 

కోవిడ్ అనంతరం టెక్ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో ఖర్చుల కట్టడిపై కంపెనీలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. రానున్న కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్  ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించింది.

మరిన్ని వార్తలు