మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను మొబైల్‌ నుంచి ఇలా తెలుసుకోండి

13 Jul, 2021 19:10 IST|Sakshi

న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌ ఖాతాలో ఎంత బ్యాలెన్స్‌ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్‌ ఖాతాలో రిజస్టర్‌ ఐనా నంబర్‌ నుంచి మెసేజ్‌, మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్‌ ఖాతాతో రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నంబర్‌ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మెసేజ్‌ లేదా మిస్డ్‌కాల్‌ చేస్తే చాలు మీ ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ మీకు కనిపిస్తోంది.

ఎస్‌ఎంఎస్‌తో పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి.

  • ఈపీఎఫ్‌ సభ్యులు రిజస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ ద్వారా వారి బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు యాక్టివ్ మోడ్‌లో ఉండేలా చూసుకోవాలి.
  • తరువాత రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN LAN’ అని టైప్‌ చేసి 7738299899 పంపాలి. మీ ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌  మీకు మెసెజ్‌ రూపంలో వస్తుంది.

మిస్డ్‌ కాల్‌తో పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి.

  • ఈపీఎఫ్‌ సభ్యులు ఈపీఎఫ్‌ సభ్యులు రిజస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి 011-22901406 కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడంతో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చును.

అంతేకాకుండా ఈపీఎఫ్‌ సభ్యులు తమ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను https://passbook.epfindia.gov.in/MemberPassBook/Loginలో లాగిన్‌ ద్వారా తెలుసుకోవచ్చును. దాంతో పాటుగా ఉమాంగ్‌ యాప్‌ ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ఉద్యోగులు తెలుసుకోవచ్చును.
 

మరిన్ని వార్తలు