ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త.. నామినీ పేరు మార్చుకోండి ఇలా..!

16 Mar, 2022 18:32 IST|Sakshi

ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇక నుంచి నామినీ పేరును కూడా ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవచ్చు అని తెలిపింది. పీఎఫ్ ఖాతాదారులందరూ నామినీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇందు కోసం ఈపీఎఫ్ఓ ​​ఈ-నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇది పూర్తిగా డిజిటల్. దీని కోసం పీఎఫ్ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ పీఎఫ్ ఖాతాకు నామినీ పేరును జత చేసుకోవచ్చు. సామాజిక భద్రత పీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐ బీమా ప్రయోజనాలను పొందడానికి ఆన్‌లైన్ ఈ-నామినేషన్ తప్పనిసరి విషయం మనకు తెలిసిందే. 

ఒకవేళ నామినీ పేరు తప్పుగా నమోదు చేసిన, ఏదైనా ఇతరత్రా కారణాల వల్ల ఇంతకముందు మీరు నమోదు చేసిన నామినీ పేరును మార్చుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ తాజాగా కల్పిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం వరకు ఈ ఆప్షన్ అందుబాటులో లేదు, ఒకవేళ వచ్చిన ఆ ఆప్షన్ సరిగా పనిచేయలేదు. కానీ, ఇప్పుడు బగ్స్ తొలిగించడంతో పీఎఫ్ ఖాతాదారులు ఎటువంటి ఆటంకం లేకుండా నామినీ పేరు మార్చుకోవచ్చు. నామినీ పేరును మార్చడానికి ఈపీఎఫ్ఓ అనుమతి అవసరం లేదు. పీఎఫ్ నామినేషన్‌లో నమోదు చేసిన తాజా పేరు మాత్రమే చట్టపరమైన హోదా కల్పిస్తారు. పీఎఫ్ నామినీ పేరును ఎలా మార్చాలో కొత్త పేరును ఎలా చేర్చాలో తెలుసుకుందాం.

పీఎఫ్ నామినీ పేరును ఎలా మార్చాలి?

  • ఈపీఎఫ్ఓ https://unifiedportal-mem.epfindia.gov.in/ ​​అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీ యుఏఎన్, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. 
  • ‘మేనేజ్‌మెంట్’ ట్యాబ్ కింద ‘ఈ-నామినేషన్’పై క్లిక్ చేయండి. 
  • మీ కుటుంబం ఉంటే ‘అవును’ అని క్లిక్ చేయండి 
  • ఇప్పుడు నమోదు చేయలని అనుకున్న కొత్త నామినీ పేరు ఎంటర్ చేయండి.
  • ‘నామినేషన్ వివరాలు’పై క్లిక్ చేయండి 
  • డిక్లరేషన్ తర్వాత, ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి 
  • ఓటీపీని పొందడానికి ‘e-Sign’ని ఎంచుకోండి 
  • ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఫిల్‌ చేయండి. 
  • ఇప్పుడు కొత్త నామినీ ఈపీఎఫ్ఓలో నమోదు అయింది.

(చదవండి: ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు లక్కీ ఛాన్స్.. రూ.1కే సినిమా టికెట్!) 

మరిన్ని వార్తలు