కరోనా కష్టకాలంలో.. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త..! లక్షవరకు!

13 Jan, 2022 14:04 IST|Sakshi

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు శుభవార్త. కరోనా కష్టకాలంలో అకౌంట్‌ నుంచి లక్షరూపాయలు అడ్వాన్స్‌గా విత్‌ డ్రా చేసుకునే అవకాశాన్ని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) సంస్థ అవకాశం కల్పించింది. 

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ హోల్డర్లు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్‌ఓ సభ్యులు అకౌంట్‌ నుంచి రూ.1లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. ఖతాదారులు ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేకుండా లక్ష వరకు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలకు లోబడి పీఎఫ్‌ విత్‌ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం 

పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు షరతులు  

వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి/సీజీహెచ్‌ఎస్‌ ప్యానెల్ ఆసుపత్రిలో చేరాలి.

ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే.., ఆస్పత్రిలో చేరేముందే విత్ డ్రా చేసుకోవచ్చు. 

పీఎఫ్‌ ఆఫీస్‌ వర్కింగ్‌ డే రోజు దరఖాస్తు చేస్తే, ఆ మరుసటి రోజే డబ్బు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది

డబ్బును ఉద్యోగి పర్సనల్‌ అకౌంట్‌ లేదంటే ఆసుపత్రి బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. 

పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు ఇలా డ్రా చేయండి

పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి లక్షరూపాయిల విత్ డ్రా ఎలా అంటే?

ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.inను సందర్శించాలి. 

వెబ్‌ పోర్టల్‌లో 'ఆన్‌లైన్ సేవలు'పై క్లిక్ చేయండి

అనంతరం 31, 19, 10C మరియు 10D ఫారమ్‌లను పూర్తి చేయాలి

ధృవీకరించడానికి మీ బ్యాంక్ అకౌంట్‌ చివరి నాలుగు అంకెలను ఎంట్రీ చేయాలి

తర్వాత 'ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్'పై క్లిక్ చేయండి

డ్రాప్-డౌన్ మెను నుండి ఫారమ్ 31ని సెలక్ట్‌ చేసుకోవాలి

డబ్బును విత్‌ డ్రా ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలి. 

అనంతరం ఆసుపత్రి బిల్లు కాపీని అప్‌లోడ్ చేయండి

మీ ఇంటి అడ్రస్‌ ను ఎంట్రీ చేసి 'సబ్మిట్‌' బటన్‌ పై పై క్లిక్ చేయండి. దీంతో పీఎఫ్‌ విత్‌ డ్రా ప్రాసెస్‌ పూర్తవుతుంది. మీ అకౌంట్‌లో డబ్బులు పడిపోతాయి.

చదవండి: ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త..! భారీగా పెరగనున్న పెన్షన్‌..! ఎంతంటే..?

మరిన్ని వార్తలు