ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు శుభవార్త..!

30 Dec, 2021 14:52 IST|Sakshi

ఈపీఎఎఫ్‌ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబ‌రు 31 త‌రువాత కూడా ఈ-నామినేష‌న్ చేయ‌వ‌చ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త చేయాల‌ని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్‌ సర్వర్‌ డౌన్ స‌మ‌స్య‌ కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ-నామినేష‌న్ చేయడానికి ఎలాంటి గడువు తేదీ లేదు అని పేర్కొనడం కొసమెరుపు. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబ‌రు 31 తర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖ‌లు చేయ‌వ‌చ్చు. అయితే ఈ రోజే నామినేష‌న్ దాఖ‌లు చేయ‌మ‌ని ఈపీఎఫ్ఓ ట్వీట్‌లో తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే బీమా డబ్బు, పెన్షన్ డబ్బుతో పాటుగా ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతారు. కొత్త నిబంధనల ప్రకారం, చందాదారుల ఆకస్మిక మరణం సంభవించినప్పుడు నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈపీఎఫ్ పొదుపును విత్ డ్రా చేయగలరు. 

ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. 

  • ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి.
  • ‎‎యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి.‎
  • మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
  • అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ‎ఈ-నామినేషన్ ఎంచుకోండి.‎
  • తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.‎
  • ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు.  
  • వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.‎
  • ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.‎
  • ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది.

(చదవండి: ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?)

మరిన్ని వార్తలు