ఈపీఎఫ్‌వో అలర్ట్‌: ఉద్యోగులకు తీపి కబురు!

25 Nov, 2022 09:37 IST|Sakshi

వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్‌వో రెడీ

75 లక్షల  ఖాతాదారులకు  ప్రయోజనం

సాక్షి, ముంబై:  పీఫ్‌ చందాదారులకు  శుభవార్త.  ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి (సీలింగ్) ని పెంచాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టు సమాచారం. చందాదారుల గరిష్ట వేతన పరిమితి రూ. 21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రూ. 15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది.  ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము అందనుంది. 

 కనీస వేతనం పెంపు?
ఈ అంశంపై త్వరలో ఒక కమిటీని వేయనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కనీస వేతన పరిమితి 21 వేలు కావచ్చు. దీని ప్రకారం ఉద్యోగుల వేతన పరిమితి  6వేల రూపాయల మేర పెరుగుతుంది.  అలాగే  ఉద్యోగి పీఎఫ్‌లో కంపెనీ ఇచ్చే కంట్రిబ్యూషన్ మొత్తం కూడా పెరగనుంది.

(చదవండి: షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్‌ కార్లు కొనాలంటే!)

ప్రస్తుతం రూ.15 వేలు జీతం ఉన్న ఖాతాదారుడికి ఖాతాలో రూ.1800 పీఎఫ్ కట్ అయితే, జీతం 21 వేలు అయితే, పీఎఫ్ మొత్తం రూ. 2530కు చేరుతుంది. ఫలితంగా  ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ఇది ఉద్యోగి, యజమాని చెల్లించే వాటాలకు కూడా వడ్డీ వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. సభ్యులకు ఈపీఎఫ్ఓ భవిష్య నిధి ఫండ్‌తో పాటు పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఫ్యామిలీ పెన్షన్, బీమా సదుపాయం కూడా ఉంది. (Bisleri1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?)

కాగా ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని కేంద్రం చివరిసారి 2014లో సవరించింది. అప్పట్లో రూ. 6,500గా ఉన్న పరిమితిని రూ. 15 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, 20 మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పథకంలో కొత్తగా 16.82 లక్షల మంది చేరారు. అలాగే, తాజా నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది ఈపీఎఫ్‌వో పరిధిలోకి వస్తారని అంచనా.
 

మరిన్ని వార్తలు