ఈ నెల్లోనే ఈపీఎఫ్‌ వడ్డీ జమ!

14 Dec, 2020 08:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆరు కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి నిల్వలపై 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ 8.5 శాతాన్ని డిసెంబర్‌ నెలాఖరులోపు జమ చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్మికమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశంలో 8.5 శాతాన్ని రెండు భాగాలుగా చేసి.. తొలుత 8.15 శాతం, తర్వాత డిసెంబర్‌ చివరిలోపు 0.35 శాతం చొప్పున జమ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ నెలలోనే 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు ఆర్థిక శాఖా సమ్మతి కోరుతూ కార్మిక శాఖ ప్రతిపాదన పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల్లోనే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావచ్చని, దాంతో ఈ నెల చివర్లోగా వడ్డీ జమ చేయడం పూర్తవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

 

మరిన్ని వార్తలు