చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!

19 Feb, 2022 14:43 IST|Sakshi

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యా, ఆరోగ్య, ప్రమాద బీమా పాలసీలను మనలో చాలా మంది తీసుకుంటుంటాం. సమయానికి ఆయా పాలసీ ప్రీమియం చెల్లిస్తే ఫైన్ల నుంచీ తప్పించుకొనే అవకాశం ఉంది.  ఒక వేళ సదరు పాలసీ ప్రీమియంను చేతిలో డబ్బులు లేక చెల్లించకపోతే ఆ పాలసీకి కాస్త బ్రేక్స్ పడే అకాశాలున్నాయి. ఐతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  (ఎల్‌ఐసి) పాలసీని కలిగి ఉన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  (ఈపీఎఫ్‌ఓ) సభ్యులు తమ జీవిత బీమా పాలసీ ప్రీమియంను చెల్లించడానికి తమ ఈపీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవడానికి అర్హులు. ఈ సౌకర్యాన్ని ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది.

  • టాక్స్, పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఈపీఎఫ్‌ఓ ​​సభ్యుడు కనీసం రెండు సంవత్సరాల LIC పాలసీ ప్రీమియం వరకు ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ కలిగి ఉంటే, LIC ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్‌ ఖాతాలోని తన డబ్బును ఉపయోగించవచ్చు. 
  • ఉద్యోగం కోల్పోవడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఈపీఎఫ్‌ఓ ​​చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతా నుంచి పాలసీ పునరుద్ధరణ చెల్లింపుతో వారి LIC పాలసీని కొనసాగించవచ్చును.
  • ఈపీఎఫ్‌ ఖాతా నుంచి  LIC ప్రీమియం చెల్లించడానికి, సదరు ఉద్యోగి ఈపీఎఫ్‌ఓ  ​​వద్ద ఫారమ్ 14ను సమర్పించాలి. అయితే, దీన్ని సమర్పించేటప్పుడు  ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో ఫారమ్ 14, సమర్పణ సమయంలో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ కనీసం రెండు సంవత్సరాల LIC ప్రీమియం మొత్తంలో ఉండేలా చూసుకోవాలి
  • ఎల్ఐసీ ప్రీమియం పునరుద్ధరణ నిబంధనల ప్రకారం, ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన  కూడా ఆయా  పాలసీని పునరుద్ధరించడానికి LIC అనుమతిస్తుంది.  పాలసీ పునరుద్ధరణ తేదీ నుంచి 6 నెలల తర్వాత పాలసీ పునరుద్ధరణపై ఎటువంటి ఆలస్య రుసుము విధించబడదు.
  • 6 నెలల నుంచి 3 సంవత్సరాల పాలసీ పునరుద్ధరణ తేదీ తర్వాత LIC పాలసీని పునరుద్ధరించినప్పుడు, పాలసీ ప్రీమియంతో పాటు కొంత ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది.
  • కాగా  ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్‌ డబ్బును కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలి.
మరిన్ని వార్తలు