ఆ ఉద్యోగులకు శుభవార్త, ఈపీఎఫ్‌వో కొత్త గైడ్‌లైన్స్‌ విడుదల.. అవేంటో తెలుసా?

31 Dec, 2022 10:50 IST|Sakshi

ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌ఓ) సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎక్కువ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగులు సైతం పీఎఫ్‌కు అర్హులేనని కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాల‍్ని పారాగ్రాఫ్‌ 11(3) 1995 స్కీమ్‌ కింద సంస్థలు 8 వారాల్లో అమలు చేయాలని సూచించింది. 

ఈపీఎఫ్‌ఓ  సర్క్యులర్‌ విడుదల
ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌లో 1995 స్కీమ్‌లోని పేరా 11(3) ప్రకారం సెప్టెంబర్ 1, 2014కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ నిబంధనల పరిధిలోకి వస్తారు. అంటే సెప్టెంబర్‌ 1,2014కి ముందు రిటైరైన ఉద్యోగులు, రిటైర్మెంట్‌కు ముందే సదరు ఉద్యోగులు అధిక పింఛన్‌ కోసం ఆప్షన్‌ తీసుకొని ఉండంతో పాటు ఇతర కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఉన్న ఉద్యోగులు మాత్రమే అర్హులు. పూర్తి స్థాయి సమాచారం కోసం ఈపీఎఫ్‌ఓ కార్యాలయాన్ని సందర్శించాలని విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. 

పీఎఫ్‌ పరిమితిని సుప్రీం ఎందుకు పెంచింది? 
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (epfo) 2014లో ఓ సవరణ చేసింది. ఆ సవరణ ప్రకారం..ఉద్యోగులు పెన్షన్‌ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్‌ పే ప్లస్‌ డియర్‌నెస్‌ అలవెన్స్‌) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్‌ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌లో తీర్పును వెలువరించింది. ఉద్యోగుల పెన్షన్‌ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సమర్థించింది. అయితే, పీఎఫ్‌లో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. 

చదవండి👉 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!

మరిన్ని వార్తలు