ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!

2 Nov, 2022 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) వడ్డీ డిపాజిట్ కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) వడ్డీ జమలను ప్రారంభించినట్టు ఈపీఎఫ్‌వో ట్విటర్‌ ద్వారా సమాచారాన్ని అందించింది. ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే మీ ఖాతాలోనే పూర్తిగా జమ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్‌ చేసింది. 2021-22 ఏడాదిగాను డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్టం వద్ద 8.1 శాతంగా ప్రభుత్వం జూన్‌లో ఆమోదించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది.  

పీఎఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?
సాధారణంగా బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్లో లాగిన్‌‌‌‌‌‌‌‌ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. 
ఖాతాదారులు అధికారిక వెబ్‌సైట్  లో  ‘మా సేవలు’ ట్యాబ్‌కు వెళ్లాలి.
ట్యాబ్‌లో, 'ఉద్యోగుల కోసం'  ఆప్షన్‌ను ఎంచుకోండి..కొత్త పేజీ  ఓపెన్‌ అయ్యాక సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా 'సభ్యుని పాస్‌బుక్'పై క్లిక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN),పాస్‌వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. పాస్‌బుక్‌లో వడ్డీ క్రెడిట్‌ అయిందీ లేనిదీ చెక్‌ చెసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేసిన వారు వేర్వేరు ఐడీ ఆధారంగా  చెక్‌  చేయాలి.
మిస్డ్ కాల్: ద్వారా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ తెలుసుకోవవచ్చు.  011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్​ చేయాలి. 
ఎస్ఎంఎస్: పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి.  యూఏఎన్​ అని ఉన్న చోట దాన్ని టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్‌ చేశాక పీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది.

మరిన్ని వార్తలు