ఎస్సెల్‌ ప్రొప్యాక్‌- టొరంట్‌ ఫార్మా హైజంప్‌

31 Jul, 2020 11:34 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

10 శాతం దూసుకెళ్లిన టొరంట్‌ ఫార్మా

14 శాతం పరుగుతీసిన ఎస్సెల్‌ ప్రొప్యాక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ప్యాకేజింగ్‌ దిగ్గజం ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్‌లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ షేరు 14.5 శాతం దూసుకెళ్లి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 243 వరకూ ఎగసింది. జూన్‌ చివరికల్లా కంపెనీ ఆర్‌వోసీఈ  4.2 శాతం బలపడి 19.9 శాతానికి ఎగసినట్లు ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. 

టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో టొరంట్‌ ఫార్మా నికర లాభం 49 శాతం జంప్‌చేసి రూ. 321 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2060 కోట్లకు చేరింది. దీనిలో దేశీ ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 925 కోట్లకు చేరింది. అయితే యూఎస్‌ ఆదాయం 1 శాతం క్షీణతతో రూ. 373 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టొరంట్‌ ఫార్మా షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 2673 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2681 వరకూ ఎగసింది.   

>
మరిన్ని వార్తలు